బిజినెస్ డెస్క్- డబ్బు.. ఈ ప్రపంచంలో అన్నింటికీ మూలం డబ్బే అని చెప్పక తప్పదు. మారుతున్న కాలంలో ఏం కావాలన్నా అందుకు డబ్బు కావాల్సిందే. డబ్బు లేనిదే జీవితంలో ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్లదు. అందుకే కలికాలం డబ్బు మయం అన్నారు. మరి డబ్బు ఎంత సంపాదించినా అది పిల్లల కోసమే కదా. తల్లిదండ్రులు తమ జీవితాన్నంతా పిల్లల కోసమే ధారపోస్తారు. కష్టపడి సంపాదించి పిల్లల భవిష్యత్తు కోసం కూడబెడతారు. ఐతే మనం చిన్న చిన్న మొత్తాలను ప్రభుత్వ పధకాల్లో పెట్టుబడిగా పెడితే పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు వారి అవసరాల మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి.
అలాంటి పధకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పధకం ఒకటి. పిల్లల పేరు పైనే నేరుగా పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు గార్డియన్ సదరు అకౌంట్ నిర్వహణ చూసుకుంటారు. ఇక పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఆ తరువాత అవసరం అనుకుంటే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఏడాదిలో 1 లక్షా 50 వేల రూపాయల వరకు డబ్బులను పీపీఎఫ్ ఖాతాలో జమ చేయొచ్చు. ఐతే సంవత్సరానికి కనీసం 500 రూపాయలు జమ చేసినా చేసినా పీపీఎఫ్ అకౌంట్ కొనసాగుతుంది. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు కూడా లభిస్తుంది.
ప్రతి సంవత్సరం పీపీఎఫ్ ఖాతాలో 1 లక్షా 50 వేల రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం 40 లక్షల రూపాయలు అందుితాయి. ఈ డబ్బులు పిల్లల ఉన్నత చదువులకు, వారి పెళ్లిళ్లకు ఖర్చు చేసుకోవచ్చు. మనకు మధ్యలో అత్యవసరంగా డబ్బులు అవసరం ఐతే లోన్ సాకర్యం కూడా పొందొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి పధకాల్లో పెట్టుబడి పెడితే వారితో పాటు పెరిగి అవసరానికి పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది.