ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ మృతి చెందారు. శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న నామరూపాల్లెకుండా అయ్యింది.
ఈ ప్రమాదంలో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి గాయాలయ్యాయి. వెంటనే ఆయను ముందు నెల్లూరు ఆస్పత్రికి, ఆ తరువాత చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటి కత్తి మహేష్ కు చికిత్స అందిస్తున్నప్పటికీ, శనివారం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చనిపోయారు. కత్తి మహేష్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కత్తి మహేశ్ మృతికి తనదైన శైలీలో సంతాపం తెలిపింది.
నా తప్పు లేకపోయినా నేను ప్రతీ రోజు చస్తూ బ్రతికాను.. నా మనస్సులో ఇప్పుడు అనిపిస్తుంది.. ఇన్ని రోజులుగా నాకు ఇలా ఎందుకు జరిగిందని.. నాకు ఏమీ అర్థం కావడం లేదు.. ఒక రాజకీయ పార్టీ బలవంతంగా ఒక దళితుడిని పరువు నష్టం కాకుండా ఉండటం కోసం.. పూర్తిగా దుర్వినియోగం చేసుకుంది.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. ఓం శాంతి.. ఇక ఆ పేరును మళ్లీ ప్రస్థావించను.. అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది.