ఈరోజుల్లో మంచి హోటల్లో భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. పోనీ దీని వల్ల ఆరోగ్యం ఏమైనా బాగుంటుందా అంటే ఏమో హోటల్ వాళ్ళు ఏం కలిపారో ఎవరికి తెలుసు. ఫుడ్ పాయిజన్ అవ్వడం, డైజెషన్ సమస్యలు వంటివి వస్తాయి. ఇవన్నీ కాదు ఇంట్లో తయారు చేసిన భోజనం తింటే ఏ సమస్యలూ ఉండవు కదా. అయినా ఊరిని, కన్నవారిని వదిలి వచ్చి నగరాల్లో ఉంటున్న వారికి ఇంటి భోజనం దొరకడం ఎక్కడ అవుద్ది చెప్పండి. అది కూడా తక్కువ ధరకి ఇవ్వడం అంటే మిషన్ ఇంపాజిబులే. కానీ జొమాటో హోటల్ ఫుడ్ కంటే తక్కువ ధరకే ఇంటి భోజనం అందిస్తుంది. అమ్మ చేతి వంట మిస్ అవుతున్నామని, ఇంటి భోజనం మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికోసం జొమాటో సరికొత్త సర్వీస్ ని లాంఛ్ చేసింది.
ఇంటి భోజనం తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. చదువు, ఉద్యోగాల పేరుతో ఊరు వదిలేసి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే వాళ్ళు అనేకమంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు రోజూ అమ్మ చేతి వంట మిస్ అవుతారు. ఇంటి భోజనం రుచిగానే కాకుండా శుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అయితే ఊరు వదిలి వచ్చినాక హాస్టల్ లో, హోటల్ లోనూ తింటే ఆ ఇంటి రుచి, శుచి, ఆరోగ్యం దొరకవుగా. తప్పక హోటల్స్ లో ఆర్డర్ చేసుకునేవారు ఇక నుంచి హోమ్ ఫుడ్ తినే అవకాశం కల్పిస్తుంది జొమాటో. ఇంటి భోజనం మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారి కోసం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ని డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎవిరిడే పేరుతో ఇంట్లో వండిన భోజనాన్ని డెలివరీ చేయనుంది.
రూ. 89కే ఇంట్లో వండించిన భోజనాన్ని డెలివరీ చేయనుంది. జొమాటో ఫుడ్ పార్టనర్స్ హోమ్ చెఫ్స్ తో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ హోమ్ చెఫ్ లు సరసమైన ధరలో నిమిషాల్లో వేడి వేడి మీల్స్ తయారు చేసి ఉంచితే.. జొమాటో కస్టమర్ కి డెలివరీ చేస్తుంది. ఇంటి భోజనాన్ని గుర్తు చేయడమే లక్ష్యంగా ఈ సర్వీస్ పని చేస్తుందని జొమాటో వెల్లడించింది. రియల్ హోమ్ చెఫ్స్ తో సరసమైన ధరల్లో ఇంటి భోజనం వండించి డెలివరీ చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రతి రోజూ ఇంటి భోజనాన్ని డెలివరీ చేస్తామని, అయితే ప్రస్తుతం గుర్గాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ ని నడుపుతామని కంపెనీ వెల్లడించింది. ఇది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లోనూ ఎవిరిడే హోమ్ కుక్డ్ ఫుడ్ ని డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లు తమకి నచ్చిన ఫుడ్ ని, కర్రీస్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చునని తెలిపింది. అలానే క్లౌడ్ కిచెన్స్/కమర్షియల్ అవుట్ లెట్స్ తయారు చేసిన హెల్దీ ఫుడ్ ని కూడా కస్టమర్స్ కి అందజేస్తుంది.
మొత్తానికి డైలీ రూ. 89 కి ఇంట్లో తయారు చేసిన భోజనం కస్టమర్స్ కోసం అందించే సర్వీస్ ని లాంఛ్ చేసింది. మిగతా నగరాల్లో కూడా ఈ సేవలు వీలైనంత త్వరగా లాంఛ్ చేస్తే బాగుంటుందని హోమ్ ఫుడ్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. పనిలో పనిగా పండగలప్పుడు పిండి వంటలు, బూరెలు, గారెలు, పరమాన్నం, ఉగాది పచ్చడి వంటివి కూడా వండించుకుని తినవచ్చు. హోమ్ చెఫ్స్ ని, హోమ్ ఫుడ్ లవర్స్ ని కలిపే కాన్సెప్టే ఒక అద్భుతం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంట్లో ఉండే తల్లులకు ఉపాధి దొరుకుతుంది, అలానే తల్లులకు, తల్లి చేతి వంటకు దూరంగా ఉన్న పిల్లలకు ఆరోగ్యవంతమైన భోజనం అందుతుంది. అమ్మ ఎక్కడైనా అమ్మే కదా. అలానే ఇంట్లో చేసిన భోజనం ఎక్కడైనా ఇంటి భోజనమే కదా. ఆ భోజనం తింటే ఆరోగ్యమే కదా. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Introducing Zomato Everyday – experience the comfort of affordable homely meals delivered to your doorsteps.
With menus designed by real home chefs, we hope this reminds you a little of your home. ❤️
Read more here: https://t.co/y3FzSFBETE#ZomatoEveryday
— Deepinder Goyal (@deepigoyal) February 22, 2023