జనరేషన్లు మారే కొద్దీ పిల్లలు మరీ దారుణంగా తయారవుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేవారు ఒకప్పుడు. నేటి బుద్ధిమంతులు రేపటి ఉత్తమ పౌరులు అని అనాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న జనరేషన్ ని చూస్తే. ఒకప్పుడు పిల్లల స్కూల్ బ్యాగులంటే పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్ లు, స్కేల్లు, లంచ్ బాక్స్ ఇవి మాత్రమే ఉండాయి. ఇప్పుడు అప్ డేట్ అయ్యారు కాబట్టి సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్తున్నారు. ఇంతకంటే అప్ డేట్ వెర్షన్ ని చూపించారు కొంతమంది స్కూల్ పోరగాళ్ళు. సినిమాల ప్రభావమో, ఇంకే ప్రభావమో తెలియదు గానీ కుర్రకుంకలు స్కూల్ బ్యాగుల్లో కం*డోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు, లైటర్లు దర్శనమిచ్చాయి. బెంగళూరులోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు విద్యార్థుల తీరుతో కంగుతిన్నారు.
8, 9, 10వ తరగతి చదువుకునే విద్యార్థులు, విద్యార్థినులు తమ స్కూల్ బ్యాగుల్లో ఇలాంటివి పెట్టుకుని తిరుగుతున్నారు. అబ్బాయిలైతే సిగరెట్లు, కం*డోమ్ లు, వాటర్ బాటిల్స్ లో మద్యం వంటివి పెట్టుకుని వస్తున్నారు. ఇక అమ్మాయిలైతే బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు పెట్టుకుని వస్తున్నారు. విద్యార్థులు క్లాస్ రూమ్ కి సెల్ ఫోన్లు తెస్తున్నారన్న సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సెల్ ఫోన్ల కంటే ఘోరమైన వస్తువులు బయటపడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి.. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. మరీ ఇంత ఫాస్ట్ గా ఉన్నారేంట్రా బాబు అని పెద్దవాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. పిల్లలు చదువుకోకుండా స్కూల్లో ఇవేం పనులురా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.