జిల్లా కోర్టులో బాంబు పేలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. కోర్టు పనివేళల్లో కాంప్లెక్స్ ఏరియాలో హఠాత్తుగా బాంబు పేలడంతో అక్కడున్న వారంతా బయటికి పరుగులు తీశారు. ఈ వార్త తెలిసేసరికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయాలపాలైనట్లు సమాచారం. హుటాహుటిన గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. పేలుడు సంభవించి కోర్టు కాంప్లెక్స్ లో ఓ గోడ కూలినట్లు తెలుస్తుంది. పేలుడు తర్వాత కోర్టు ఆవరణలో పొగ ఆవరించి ఉన్న వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Punjab | Several feared injured in explosion in Ludhiana District Court Complex
Details awaited. pic.twitter.com/H3jaqit93H
— ANI (@ANI) December 23, 2021