ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీల నివాసంలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో అనంత్, రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్ సెర్మనీ తర్వాత అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది.
ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఇషా, ఆమె భర్త ఆనంద్ పిరమల్ స్టెప్పులతో అదరగొట్టారు. బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘హమ్ ఆప్కే హై కౌన్’ నుంచి ‘వా వాహ్ రామ్‌జీ’ పాటకు అంబానీ కుటుంబం కలసి వేసిన డ్యాన్స్ మూమెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, అనంత్, రాధికల నిశ్చితార్థ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్లు పాల్గొన్నారు. రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణే, కరణ్ జోహర్, వరుణ్ ధావన్ తదితరులు ఈ సెర్మనీకి హాజరై జంటను ఆశీర్వదించారు. ఇక, అనంత్-రాధికల వివాహం ఈ ఏడాదే జరగనుందని సమాచారం.
#WATCH | The Ambani family dances at the ring ceremony of Anant Ambani and Radhika Merchant
The engagement ceremony was held at Mukesh Ambani’s Mumbai residence ‘Antilla’ yesterday pic.twitter.com/mmNsI9fzkc
— ANI (@ANI) January 20, 2023