బాగా చదివే వారిని ప్రోత్సహించాలే గానీ ఎంత పెద్ద పరీక్షలనైనా అవలీలగా పాసవుతారు. అప్పుడప్పుడూ విద్యార్థులను ప్రోత్సహించేలా సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. ఫస్ట్ క్లాస్ లో పాసైతే ఇంట్లో తల్లిదండ్రులు సైకిలో లేదా ఏదైనా విలువైన వస్తువో కొనిస్తారు. లేదంటే ఏ ట్రిప్ కో తీసుకెళ్తుంటారు. అయితే చాలా మంది విద్యార్థులకి ఆకాశంలో విహరించాలన్న కోరిక ఉంటుంది. ఆకాశంలో విమానమో, హెలికాఫ్టరో వెళ్తుంటే చేతులు ఊపుతుంటారు. మరి ఈ కోరికను నెరవేర్చేది ఎవరు? అంటే ఒకరున్నారు. ఏపీ సీఎం జగన్ లా చదువుని ప్రోత్సహించేలా.. ఎట్ ద సేమ్ టైం విద్యార్థుల కల నెరవేరేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఒక వ్యక్తి. మీరు బాగా చదివి స్టేట్ ఫస్టు, జిల్లా ఫస్టు రండి. నేను మిమ్మల్ని హెలికాఫ్టర్ లో తిప్పుతా అని హామీ ఇచ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం విద్యార్థులను హెలికాఫ్టర్ లో గగన విహారం చేయించింది. 10, 12వ తరగతుల పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను హెలికాఫ్టర్ లో నాలుగు రౌండ్లు తిప్పింది అక్కడి ప్రభుత్వం. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి, 12వ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హెలికాఫ్టర్ లో తిప్పుతానని మే నెలలో ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటారని, వారిని ప్రోత్సహించాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని గతంలో ఛత్తీస్ గఢ్ సీఎం తెలిపారు. చెప్పినట్టుగానే టాపర్లుగా నిలిచిన 125 మంది విద్యార్థులను హెలికాఫ్టర్ లో తిప్పించారు.
“A helicopter ride will be arranged by the Chhattisgarh government for all class 10 and 12 students who will top their districts”: Chief Minister Bhupesh Baghel
(ANI) pic.twitter.com/5eMhrrSh4H
— NDTV (@ndtv) May 5, 2022
ఈ హెలికాఫ్టర్ రైడ్ లో ఒకసారి ఏడుగురు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. 7గురు చొప్పున 18 సార్లు 125 మంది విద్యార్థులను హెలికాఫ్టర్ లో గగన విహారం చేయించారు. ఈ అద్భుతమైన ఘట్టం ఇవాళ ఉదయం 8 గంటలకి రాయ్ పూర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఊరు నుంచి మొదట హెలికాఫ్టర్ రైడ్ చేసిన విద్యార్థిని నేనే అంటూ కుమారి కుంతి అనే విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. సీఎం చేసిన పనికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం మర్చిపోలేదు, ఆ హామీని పొందే అర్హతను విద్యార్థులూ వదులుకోలేదు. శభాష్..
#WATCH | Raipur, Chhattisgarh: Toppers of class 12 and class 10 were taken on a helicopter ride by the state govt as was promised by CM Bhupesh Baghel in May pic.twitter.com/gjHu8lGBKS
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 8, 2022
हेलीकाप्टर की जायराइड से लौटने के बाद मेधावी छात्रा नित्या रानी ने बताया कि बहुत एक्साइटमेंट था, बहुत मजा आया, मैंने आज हेलीकॉप्टर की राइड की, मुख्यमंत्री जी को बहुत बहुत धन्यवाद।#chhattisgarh #CGNews #Raipur #Helicopter #Ride #Students
और पढ़ेंhttps://t.co/1I1qPHzmug pic.twitter.com/uZfGosQdwr— NaiDunia (@Nai_Dunia) October 8, 2022
Helicopter ride for the meritorious students of class 10 and 12 to motivate others for better education, announced CM Bhupesh Baghel at meet the press during state wide tour. @ChhattisgarhCMO #BhetMulakat # Bhupesh Tuhr Dwar pic.twitter.com/hwsCnAZrGh
— Sushil Agrawal (@sushilraipuria) May 5, 2022