టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్ను మూశారు. ముంబై సమీపంలోని పల్ఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి ముంబై కారులో వెళ్తుండగా డివైడర్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని పల్ఘర్ పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షాపూంజి, పల్లోంజి గ్రూప్ సంస్థల ఛైర్మన్ గా కొనసాగుతున్న సైరస్ మిస్త్రీ.. టాటా గ్రూప్ ఛైర్మన్ గా దాదాపు 22 ఏళ్ళ పాటు పనిచేశారు. ఆ తర్వాత రతన్ టాటాతో విబేధాల కారణంగా బయటకు వచ్చేశారు.
#CyrusMistry, former Chairman of #TataSons, while travelling from Ahmedabad to Mumbai, died in a road accident after his car hit a divider. 4 people were present in the car; 2 died on spot & 2 were moved to hospital: Palghar police officials pic.twitter.com/ExLJFZ8TH7
— The Times Of India (@timesofindia) September 4, 2022