వారిద్దరు గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి.. పెళ్లి చేయాల్సిందిగా కోరారు. కానీ వారు అంగీకరించకపోవడంతో.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. వివాహం చేసుకున్నారు. నిండు నూరేళ్ల పాటు సంతోషంగా సాగాల్సిన వారి వైవాహిక జీవితంలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న భార్య.. అతడికి భారీ షాక్ ఇచ్చింది. భార్య చేసిన మోసం తట్టుకోలేకపోయిన సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు విలుపురంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
తమిళనాడు విలుపురం ప్రాంతానికి చెందిన వెట్రివేల్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ధరణి(19) అనే యువతి గత మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించి.. తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపారు. కానీ వారు అంగీకరించకపోవడంతో.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. డిసెంబర్ 30 న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసి.. ధరణి తండ్రి.. వెట్రివేల్ కు కాల్ చేసి చంపేస్తానని బెదిరించసాగాడు.
భయపడిన వెట్రివేల్ ఈ విషయం గురించి పోలీసులకు తెలిపి.. తమకు రక్షణ కల్పించాల్సిందిగా జిల్లా ఎస్పీ ని కోరారు. వెట్రివేల్ ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాలకు నోటీసులు పంపించి.. మాట్లాడాలని పోలీస్ స్టేషన్ కు రమ్మని పిలిచారు. తల్లిదండ్రులను చూసిన ధరణి… ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు ఊహించని షాకిచ్చింది. తల్లిదండ్రులతో పాటే వెళ్తానని పోలీసులకు తెలిపింది. దాంతో ఆమెని తల్లిదండ్రులతో పాటు పంపించారు పోలీసులు.
జీవితాంతం తనతో ఉంటుందని నమ్మి.. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా.. వారందరని కాదనుకుని పెళ్లి చేసుకుంటే.. చివరకు అతడికి ఊహించని షాక్ ఇచ్చింది ధరణి. దీన్నుంచి తేరుకున్న వెట్రివేల్.. భార్య చేసిన మోసాన్ని భరించలేక.. తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని మరణించాడు. వెట్రివేల్ ఆత్మహత్యపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ముండియంబాకం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. వెట్రివేల్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.