ఈమధ్య కాలంలో ప్రయాణంలో ఉన్న వాహానాలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. రన్నింగ్ వెహికల్స్‌లో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ వీడియో వెలుగు చూసింది. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. దాంతో అతడు కళ్లు తిరిగి స్టీరింగ్ మీదే పడిపోయాడు. అయితే అదృష్టం కొద్ది.. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ వివరాలు.
ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు ఒకటి.. అంబగరత్తూర్ నుంచి కారైకాల్ వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌కు ఉన్నట్లుండి ఫిట్స్ వచ్చి.. స్టీరింగ్ మీదకు పడిపోయాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే వారి అదృష్టం కొద్ది.. బస్సు వెళ్లి ఓ దుకాణాన్ని ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమారాల్లో రికార్డవ్వడంతో.. ఈ వీడియో వైరలవుతోంది. స్థానికులు వారిని కాపాడి.. ఆస్పత్రికి తరలించారు.