దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రి పని తీరుపై సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టూడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కొంతమంది ముఖ్యమంత్రులకు మద్దతు తగ్గగా, మరి కొందరికి ఏకంగా అగ్రభాగానికి ఎగబాకింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం కాస్త మద్దతు తగ్గిందనే చెప్పాలి. గతంతో పోలిస్తే పూర్తిగా తగ్గినట్లు సమాచారం. గతంలో నిర్వహించిన సర్వేలో తదుపరి భారత ప్రధాని ఎవరన్నదానికి 64% మద్దతు రాగా ఈ సారి సర్వేలో మాత్రం మోదీకి ఏకంగా 34 శాతానికి పడిపోయింది. దీంతో బీజేపీ అభిమానులు కాస్త షాక్‌కు గురవుతున్నారు. ఇక దీంతో పాటు ముఖ్యమంత్రుల పని తీరుపై నిర్వహించిన సర్వేలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనకంజలో కొనసాగుతున్నారు.
ఇక మొదటి స్థానంలో మాత్రం దేశంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 42% తో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు.ఈ తర్వాత 38% మద్దతుతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక 35% కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూడు స్థానంలో ఉన్నారు. కాగా దిగువ స్థానాల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు.