ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యమే. అతివేగంతో డ్రైవర్లు వాహనాలతో దూసుకెళ్లి ప్రమాదాల భారిన పడతారు. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది.
ప్రమాదం ఏ క్షణాన, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఊహించని ప్రమాదాలతో కుటుంబాలు విషాదంలోకి నెట్టి వేయబడుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యమే. అతివేగంతో డ్రైవర్లు వాహనాలతో దూసుకెళ్లి ప్రమాదాల భారిన పడతారు. ఈ ప్రమాదాల్లో పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వారి కుటుంబాలు కూడా వీధిన పడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోడ్డుమీద వెళ్తూ ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోడ్డుపై వెళ్తుంది. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తాపడింది. దీంతో ఐదుగురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ టర్నింగ్ కోసం బస్సును వెనక్కి తీస్తుండగా రోడ్డు పక్కన గుంత ఉంది. డ్రైవర్ గుంతను గమనించకపోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. త్రుటిలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అనుభవం లేని డ్రైవర్‌తో బస్సును నడిపిస్తున్నారని పేరెంట్స్ ఆరోపించారు. ఏసీసీ రజనీశ్ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ.. గాజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అందరు క్షేమంగా ఉన్నారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.