కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరో సంక్షోభం సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. తూర్పు ఉక్రెయిన్ లోని లుహాన్క్స్ , దోనెట్క్స్ రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒక రోజు గడువులో ఏకంగా ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతంపై మిలిటరీ దాడులు చేపట్టాలని రష్యా బలగాలకు ఆదేశాలిచ్చారు . ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు బంగారం పరుగులు పెడుతోంది.
ప్రస్తుతం ఈ సంక్షోభం ముదిరితే దేశంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయనేది పెద్ద అంశం.