దొంగలు బరితెగించారు. ఇళ్లా, గుడా, రోడ్డా అనే సంబంధం లేకుండా చోరీలకు దిగుతున్నారు. దేశ రాజధానిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి నుండి లక్షల్లో డబ్బులు మాయం చేశారు. చుట్టు పక్కల ఉన్న వారికే కాదూ.. బాధితుడికి కూడా ఆ విషయం తెలియలేదు.
దొంగలు కన్ను మూసి తెరిచే లోపు దోపిడీలకు పాల్పడుతున్నారు. బాధితులకు దోచుకుంటున్న విషయం కూడా తెలియడం లేదు. ఇళ్లా, గుడా, రోడ్డా అనే సంబంధం లేకుండా చోరీలకు దిగుతున్నారు. అడ్డం వచ్చిన వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. నడి రోడ్డుపై దోపిడీకి పాల్పడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. నడి రోడ్డుపై ఓ వ్యక్తి నుండి డబ్బులు దోచేశారు ముగ్గురు దొంగలు. రెప్పపాటులో ఈ దొంగతనం జరగ్గా.. బాధితుడు.. అక్కడే ఉన్న జనాలు సైతం గమనించలేదు. ఈ మొత్తం ప్రక్రియకు నాలుగు సెకండ్లు కూడా పట్టలేదంటే ఎంత చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారో అర్థమౌతోంది.
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ ఘటనలో రూ.40 లక్షలు దోచేశారు. ఓ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆగుతూ వెళుతున్నాయి. అనీష్ అనే వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని బైక్ పై వెళుతున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకు రాగానే అతడిని ముగ్గురు ఫాలో అవుతూ వచ్చారు. కార్ల మధ్యలో నుండి స్లోగా వెళుతున్న బైక్ దగ్గరికి చేరుకున్న దొంగలు..బ్యాగ్ జిప్ మెల్లిగా తీసి రూ. 40 లక్షలు కాజేశారు. ఓ వ్యక్తి డబ్బును తీసి మరో ఇద్దరికి అందించాడు. ఇదంతా సిసిటీవి కెమెరాలో రికార్డు అయ్యాయి. కేవలం నాలుగు సెకండ్లలో డబ్బును దోచేశారు. ఆపై అక్కడి నుంచి ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు.
కాసేపటికీ బ్యాగ్ తనిఖీ చేసుకున్న బాధితుడు లబోదిమంటూ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ముగ్గురులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఆకాష్, అభిషేక్ లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 38 లక్షలకు రికవరీ చేశారు. బాధితుడు అనీష్ ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను మహదేవ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి నార్త్ ఎవెన్యూలోని ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బైకర్లను లక్ష్యంగా ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు.
— Hardin (@hardintessa143) March 7, 2023