ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లేని ఇళ్లు లేవు. గ్యాస్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ క్రమంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే.. వావ్ బంపరాఫర్ అంటాం కదా.. మరి ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
ఇంధన ధరలు ఆకాశన్నంటుతాయి. పెట్రోల్, డిజీల్ వంటి వాటి రేట్లు చుక్కలను తాకుతున్నాయి. నెల ప్రారంభం అయ్యింది అంటే చాలు.. గ్యాస్ ధరలు పెరగడం పరిపాటి అయ్యింది. ఇప్పటికే 14 కేజీల సిలిండర్ ధర 1000 రూపాయలకు పైగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అది కూడా ఒకటి కాదు రెండు ఏడాదికి 12 సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరి ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడ.. ఎవరు దీనికి అర్హులు అంటే..
ఎన్నికలు సమిపీస్తోన్న వేళ రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపించేందుకు రెడీ అయ్యింది. తాజాగా నిర్వహించిన బడ్జెట్2023-2024 సమావేశాల సందర్భంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈమేరకు ప్రకటన చేశారు. దీనిలో భాగంగా ఉజ్వల యోజన ద్వారా అందించే గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వనుంది. అయితే అందరికి ఈ ఆఫర్ వర్తించదు. బీపీఎల్ కెటగిరి కిందకు వచ్చే వారికి మాత్రమే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వనున్నారు. రాజస్థాన్ వ్యాప్తంగా ఉన్న 76 మంది బీపీఎల్ కుటుంబాలకు ఈ ఆఫర్ వర్తించనుంది. బీపీఎల్ కెటగిరీ కిందకు వచ్చే కుటుంబాలకు ఏడాదికి 12 సిలిండర్లను 500 రూపాయలకే ఇవ్వనున్నారు.
రాజస్థాన్‌లో నివాసం ఉండి.. బీపీఎల్ కేటగిరిలోకి వచ్చే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న రాజస్థాన్ వాస్తవ్యులకు ఈ ఆఫర్ వర్తించదు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. మరి రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.