ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే నాయకులు ఎలా నడుచుకోవాలి.. ఎలా పాలించాలి. ప్రతి క్షణం ప్రజల గురుంచే ఆలోచించాలి కదా. కానీ, అలా ఆలోచించేవారు వారి సంఖ్య.. చేతికున్న వేళ్ళ సంఖ్యను మించదు. ఎంతసేపు వారి ఖజానాను ఎలా నింపుకోవాలన్నదే వారి ఆలోచనే. ఇలాంటి రోజుల్లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద, బడుగు బలహీన వర్గాల వారు కడుపునిండా వండుకుతినే శుభవార్త చెప్పాడు. ఏప్రిల్ 1 నుండి రూ.500 ధరకే గ్యాస్ సిలిండర్ అమ్ముతామని ప్రకటన చేశారు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏది..? ఆ ముఖ్యమంత్రి ఎవరా..? అన్నది ఇప్పుడు చూద్దాం..
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,100 పైమాటే ఉంది. దీనికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే సిబ్బందికి ఇచ్చే 20 రూపాయలు కలుపుకుంటే రూ. 1,120. ఈ ధరలతో.. ఏ పూటకు ఆ పూట వండుకునేవారి సంఖ్య బాగా తగ్గింది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా అన్ని పూటలకు కలిపి ఒకేసారి వండుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయాన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ.500 ధరకే అమ్ముతామని ప్రకటించారు. ఏటా 12 సిలిండర్లను రూ.500 ధరకే కొనుగులు చేయవచ్చు. అయితే, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు.. గెహ్లాట్. “ఉజ్వల పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు ఎల్‌పీజీ కనెక్షన్లు, గ్యాస్ ఓవెన్లు అందిస్తున్నారు.. కానీ సిలిండర్ ఖాళీగానే ఉంది.. ఎందుకంటే ఇప్పుడు రేట్లు రూ. 400 నుంచి రూ.1,040కు చేరాయి..” అంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
#Rajasthan में BPL और उज्ज्वला योजना के अंतर्गत आने वाले लोगों को 1 अप्रैल से ‘500 रुपए’ में रसोई गैस सिलेंडर…
मुख्यमंत्री जी की बड़ी घोषणा।#AlwarBoleBharatJodopic.twitter.com/jHfsuQxNM3— Lokesh Sharma (@_lokeshsharma) December 19, 2022