భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నరేంద్ర మోడీ ఆస్తుల విలువను పీఎంవో అధికారికంగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్‌సైట్ వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు విలువ రూ. 2.23 కోట్లు కాగా, ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగర్ లో ఉన్న కాస్త స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు. స్వంత వాహనం లేదు. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉండగా.. వాటి విలువ 1.73 లక్షలు. మార్చి 31వ తేదీన ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా ఈ వివరాలు పొందుపరిచారు. ఏడాది కాలంలో మోదీ ఆస్తులు 26.13 లక్షలు పెరిగాయి.
Prime Minister Narendra Modi has made public the amount of his assets.
Gold rings 4; worth ₹1.73 lakh
Bank balance ₹46,555
Cash in hand ₹35,250
Savings certificates ₹9,05,105
Life Insurance ₹1,89,305
Fixed Deposit and Multiple Option Deposit ₹2,10,33,226
Total ₹2.23 crore pic.twitter.com/tctTXcEiTT— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) August 9, 2022
పిఎంవో వెబ్‌సైట్‌లో మరో పది మంది కేంద్ర మంత్రుల ఆస్తుల చిట్టా కూడా ఉంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్తులు మార్చి 31, 2022 నాటికి రూ.2.24 కోట్ల నుంచి రూ.2.54 కోట్లకు చేరగా.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల విలువ రూ. 1.62 కోట్ల నుండి రూ. 1,83 కోట్లకు పెరిగింది. ఇక.. పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా నికర ఆస్తుల విలువ రూ.7.29 కోట్లు, గతేడాదితో పోలిస్తే రూ.1.42 కోట్లు పెరిగింది. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఆస్తులు రూ. 35.63 కోట్లుకాగా, అప్పులు రూ. 58 లక్షలుగా నివేదించారు. సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ. 1.43 కోట్లుగా ప్రకటించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో, పబ్లిక్ డొమైన్‌లో పారదర్శకతను కొనసాగించడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర మంత్రులందరూ తమ ఆస్తులను ప్రకటించాలని నిర్ణయించారు. అది అలానే కొనసాగుతోంది.
ఇదీ చదవండి: మూడు రోజుల్లో సీఎం యోగిని చంపేస్తాం.. వార్నింగ్ మెసేజ్!
ఇదీ చదవండి: Nitish Kumar vs BJP: బీహార్ పొలిటికల్ గేమ్ లో చక్రం తిప్పేదెవరు?