ఒక పక్క తీవ్రమైన చలి మనుషుల ప్రాణాలను తీస్తుంది. కానీ ఒక 72 ఏళ్ల వృద్ధుడు అదేమీ పట్టించుకోకుండా ఇంతటి చలిలో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. జీవితంలో ఏరోజూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని ఆ పెద్దాయన.. అతని కోడలి వల్ల పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. ఈ పెద్దాయన కోడలు ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది లేచిపోయింది. దీంతో తన కోడల్ని వెతకండి మహాప్రభో అంటూ పోలీసులను వేడుకున్నాడు. భర్తను, పిల్లల్ని వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. అతని పేరు రామ్ ప్రసాద్. వంగిన నడుము, అడుగులు కూడా సరిగా వేయలేని పరిస్థితి. తెల్లని గడ్డం, ముఖం మీద ముడతలు.
ఇంతటి వృద్ధాప్యంలో అతను తన కోడలి ఆచూకీ కోసం 70 కి.మీ. సైకిల్ మీద కాన్పూర్ లో ఉన్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చాడు. రామ్ ప్రసాద్ కాన్పూర్ జిల్లాలో ఘటంపూర్ లోని దహేలి గ్రామంలో ఉంటాడు. ఇతనితో పాటు కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. సుమిత్ అనే వ్యక్తితో కోడలికి లవ్ ఎఫైర్ ఉంది. 15 రోజుల క్రితం.. సుమిత్, తన ఫ్రెండ్ కరణ్ ఇద్దరూ సైలెంట్ గా పెద్దాయన కోడలిని తీసుకెళ్లిపోయారు. రామ్ ప్రసాద్, అతని కొడుకు ఇద్దరూ ఘటంపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకుని పారిపోయిందని తెలిపారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో అతను తన ఊరికి 70 కి.మీ. దూరంలో ఉన్న కాన్పూర్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి సైకిల్ మీద వెళ్ళాడు.
ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరాడనుకున్నా 6 గంటల పాటు నాన్ స్టాప్ గా సైకిల్ తొక్కడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా 72 ఏళ్ల వయసులో. అయితే ఈ వయసులో సైకిల్ మీద 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ ఫిర్యాదు చేయడానికి వచ్చిన పెద్దాయనను చూసి కమిషనర్ గుండె తరుక్కుపోయింది. దీంతో వెంటనే ఘటంపూర్ పోలీసులకు కాల్ చేసి.. కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలతో పెద్దాయన ఫిర్యాదుని తీసుకుని.. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఘటంపూర్ ఏసీపీ దినేష్ వెల్లడించారు. మరి 72 ఏళ్ల వయసులో కోడలి ఆచూకీ కోసం 70 కి.మీ. సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి మరీ ఫిర్యాదు ఇచ్చిన పెద్దాయనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.