ఏ దేశంలోనైనా ముఖ్య నాయకులు, వ్యక్తులకు ఉండే భద్రతా ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే దేశ ప్రధాని విషయంలో అయితే ఇంకెంత అప్రమత్తంగా ఉంటారు? ఏ దేశానికి తీసిపోకుండా మన దేశంలోనూ పెద్ద పెద్ద నాయకుల విషయంలో ప్రత్యేక భద్రత ఉంటుంది. అదే ప్రధాని విషయంలో అంటే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ భద్రతా ఏర్పాట్ల టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ప్రధాని మోదీ కాన్వాయ్ లోకి ఓ అద్భుతమైన కారు చేరింది కాబట్టి. అది కూడా ప్రపంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి కాబట్టి. మరి ఆ కారు విశేషాలు, ప్రత్యేకతలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ప్రధాని మోదీ కాన్వాయ్ లోకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన మెర్సిడెజ్- మేబ్యాక్ S650(Mercedes-Maybach S650) చేరింది. ఈ కారు రేటులోనే కాదు.. సేఫ్టీలోనూ వారెవ్వా అనిపిస్తుంది. ఇప్పటికే మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ వోగ్, టొయోటా ల్యాండ్ క్రూయిజర్, BMW-7 సిరీస్ కార్లు ఉన్నాయి. తాజాగా అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన మెర్సిడెజ్- మేబ్యాక్ S650 కారు చేరింది. ఈ కారు మొదట రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ కు స్వాగతం పలికే సమయంలో ప్రధాని ఈ కారులో కనిపించారు. ఆ తర్వాత ఇటీవల ఈ కారు మోదీ కాన్వాయ్ లో తళుక్కుమంది.
The Mercedes-Maybach S650 armoured vehicle is an upgrade from the prime minister’s Range Rover Vogue and the Toyota Land Cruiser #Delhi #YellowAlert pic.twitter.com/BwXOAyCypN
— Karan Bharti (@karanbhartii) December 28, 2021
ఈ కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ కారు భద్రతా ప్రమాణాలు ఆ రేంజ్ లో ఉన్నాయి. ఈ కారు VR 10 లెవల్ రక్షణ కలిగిన కారు. AK-47తో కాల్పులు జరిపినా ఈ కారు బాడీ, అద్దాలు ఆ బుల్లెట్లను తట్టుకోని నిలబడగలదు. ఈఆర్వీ(ఎక్స్ ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్) 2010 రేటింగి కలిగి ఉంది. రెండు మీటర్ల దూరంలో 15 కిలోల TNT పేల్చినా కారులోని వారికి ఏం కాదు. కారు కింది భాగం ఎంతో పటిష్టమైంది. నేరుగా బ్లాస్ట్ జరిగినా కారులోని ప్రయాణికులకు ఏం కాదు. అంతే కాకుండా గ్యాస్ అటాక్స్ వంటివి జరిగితే తట్టుకునేందుకు సెపరేట్ ఎయిర్ సప్లై ఉంటుంది.
◼ 2014: Mahindra Scorpio mHawk
◼ 2015: BMW 7 Series 760 Li High-Security Edition
◼ 2017: Toyota Land Cruiser
◼ 2019: Range Rover Vogue HSE
◼ 2021: Mercedes-Maybach S650 Guard#ModiCareFund pic.twitter.com/TXB4wUnF9D— Sadaf Jafar (@sadafjafar) December 27, 2021
ఈ కారులో 6.0 ట్విన్ టర్బో V12 ఇంజిన్ ఉంది. ఈ కారు గరిష్ట వేగం 160 Kmph ఉంటుంది. టైర్ పంచర్ అయినా.. గాలి లేకపోయినా అలాగే డ్రైవ్ చేయవచ్చు. స్టాండర్డ్ మేబ్యాక్ తరహాలోనే ఈ కారులోనూ మసాజ్ సీట్లు ఉంటాయి. ఎక్స్ ట్రా లెగ్ రూమ్ కోసం సీటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రధానికి కారు ఎంపిక చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. ఆయన భద్రత పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) నిర్ణయిస్తుంది. ప్రధాని కారును SPG పర్యవేక్షిస్తుంది. భద్రతా ప్రమాణాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. SPG ఓకే చెప్పిన తర్వాతనే ఆ కారు ప్రధాని కాన్వాయ్ లో చేరుతుంది. అదండి ప్రధాని మోదీ కాన్వాయ్ లో చేరిన కొత్త మెర్సిడెజ్- మేబ్యాక్ S650 ప్రత్యేకతలు.
#Gravitas | Indian prime minister has got a new set of wheels – the Mercedes-Maybach S650. What makes this car a travelling fortress? What do other world leaders use? @palkisu tells you.@narendramodi @PMOIndia pic.twitter.com/FatjQnjRU3
— WION (@WIONews) December 28, 2021