ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. కల్లాకల్మషం లేని మనసు.. బోసి నవ్వులు, అమాయకపు ఆటలతో ఎంతో సంతోషంగా సాగుతుంది. అయితే,.. ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. కాలంతో పాటు పరుగులు తీస్తున్నాం. పిల్లల్ని కూడా వదలడం లేదు. పుట్టిన వెంటనే వారి చదువు గురించి ఆలోచనలు.. పట్టుమని మూడేళ్లు కూడా నిండకముందే బడిలో వస్తున్నాం. ఇక ఆటపాటలకు వారి జీవితంలో సమయం ఎక్కడది. తాజాగా ఓ బుడతడికి కనీసం రెండేళ్ల సమయం కూడా ఇవ్వకుండానే 15 నెలలకే బడి బాట పట్టిస్తున్నారు తల్లిదండ్రులు. అది కూడా ఏ సామాన్యుడో అయితే మనం చెప్పుకునే వాళ్ల కాదు. ఏకంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ మనవడు ఇలా 15 నెలలకే బడికి వెళ్తుండటంతో.. దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది
ముఖేష్ అంబానీకి 2020, డిసెంబర్‌లో మనవడు పుట్టిన విషయం తెలిసిందే. తనకు మనవడు పుట్టాడని అంబానీ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. మార్చి, 2019లో, ముఖేష్, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, వ్యాపారవేత్త రస్సెల్ అరుణ్‌భాయ్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో వివాహ జరిగింది. ఇక వారికి 2020 డిసెంబరు 10న పృథ్వీ జన్మించాడు. ఆ బుడతడికి కనీసం రెండేళ్లు కూడా నిండకముందే.. తన చదువు గురించి ఆలోచించారట. ఆలోచించడం అనే మాట పక్కన పెడితే.. పిల్లాడిని ఏ స్కూలుకు పంపాలనే విషయంపై కుటుంబమంతా చర్చలు కూడా జరిపారట.ఫైనల్ గా.. పృథ్వీని అతడి తల్లిదండ్రులు ఆకాష్, శ్లోకాలు చదువుకున్న మలబార్ హిల్‌లోని సన్‌ఫ్లవర్ స్కూల్ కే పంపాలని నిర్ణయించుకున్నారట. అనుకున్నదే తడువుగా.. ఆడుకునే వయసున్న పిల్లాడిని స్కూల్ కి పట్టుకెళ్తున్నారు. బడికి వెళ్ళమంటే మారాం చేస్తాడనుకున్నారో.. ఏమో.. తల్లిదండ్రులే స్వయంగా దగ్గరుండి మరి పృథ్వీని స్కూల్‌కి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
The richest family in India unanimously decided to send the toddler Prithvi Ambani to Sunflower School in Malabar Hill. The little one’s parents also studied in the same school. pic.twitter.com/sIQht39LZp
— Siddarth Srinivas (@sidhuwrites) March 15, 2022
ఆ స్కూల్ టీచర్లు తరగతి గదిలో పృథ్వీని మిగతా పిల్లలందరికీ పరిచయం చేశారు. అంతేకాకుండా పృథ్వీ జీవితంలో ‘విద్య’ అనే పుస్తకం పేజీలు తెరచుకున్నాయని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ సందర్భంగా పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు అతనిని ఒక ‘సాధారణ’ జీవితానికి అలవాటు పడేలా చేయాలని టీచర్లను కోరినట్లు తెలుస్తోంది. ఏంటో సరిగా మాటలు కూడా రాని పసివాడిని ఇలా పాఠశాలలో చేర్చడం ఏంటో పాపం అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Unassuming humility from Mukesh Ambani’s family as Prithvi Ambani goes to a nursery, the school will treat the cute little kid as equal to any other child attending it. pic.twitter.com/qsZfqpf6qa
— Salman Khan FC (@BeingSalmanClub) March 15, 2022
Simplicity and humility is what that defines Mukesh Ambani’s family. Prithvi Ambani will attend the same nursery school as his parents Akash and Shloka Ambani, and will be treated equal to any other kids there. pic.twitter.com/TLO27U2twP
— Aarti Thakur (@JollyGall91) March 15, 2022