భారత స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఆజాదీ కా అమృతోత్సవాలను కేంద్రం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ‘హర్ ఘర్ తిరంగా’ అనే కార్యక్రమాన్నిచేపట్టింది. దీనిలో భాగంగానే భారతీయ పోస్టల్ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఓ అంధ విద్యార్థికి అభినందనలు తెలుపుతూ మోదీ ట్వీటర్ ద్వారా ప్రశంసించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఈ నెల 10వ తేదీన పోస్టల్ శాఖ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో విశాఖలోని సాగర్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్. మాధురి 9వ తరగతి చదువుతోంది. పోస్టల్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోని జెండాలోని మూడు రంగులను తాకుతూ.. తన అనుభుతిని, దేశంపై తనకున్న భక్తిని చాటి చెప్పింది. కళ్లు ఉన్న వారే జాతీయ జెండాని అవమానించిన సంఘటనలు వెలుగు చూసే ఈ రోజుల్లో చూపు లేని ఈ బాలిక చాటి చెప్పిన దేశ భక్తికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఆ ప్రసంగాన్ని చూసిన మోదీ.. ఆ బాలిక చెప్పింది నిజం..జాతీయ జెండాలోని మూడు రంగులు ప్రజల హృదాయాలను తాకాయని ప్రశంసించారు. అంతేకాక మాధురికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని అంతా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు అని ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్. మహేశ్వర రెడ్డి తెలిపారు. మధురి దేశ భక్తికిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This video offers a glimpse of how deeply every Indian is attached with the Tricolour. Truly touching! #HarGharTiranga https://t.co/xH6oF6gB1k
— Narendra Modi (@narendramodi) August 13, 2022