ఒడిశా రైలు ప్రమాద ఘటన వెనుక కుట్ర ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒడిశాలోని రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఎప్పుడూ లేని విధంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 238 మందికి పైగా ప్రయాణికులు మరణించగా, 900 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలు బండిని ఢీ కొట్టడంతో బోగీలు బోల్తా పడ్డాయి. మొత్తం 17 బోగీలు బోల్తా పడ్డాయి. సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితులను హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలానే మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా ఈ ఘటనపై రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, సినీ ప్రముఖులు ప్రమాదంపై స్పందిస్తున్నారు. పశ్చిమ వెంగల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. రైలు ప్రమాద ఘటనపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని అన్నారు. ఐతే ఇప్పుడు రాజకీయం చేసే సమయం కాదని అన్నారు.
మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ముందు చెన్నై వెళ్తున్న కోరమాండల్ షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అనంతరం గూడ్స్ రైలుని ఢీకొంది. దీంతో బోగీలు బోల్తా పడ్డాయి. అదే సమయంలో యశ్వంతపుర-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన రెండు రైళ్ల బోగీలను ఢీకొట్టింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 62 మంది తెలుగు వారు ఉండగా.. యశ్వంతపుర ఎక్స్ ప్రెస్ లో 52 మంది తెలుగు వారు ఉన్నారు.