ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా వివాహితులపై దాడులు మరింత వేగం పెరిగిన విషయం తెలిసిందే. పెళ్లైన కొంత కాలం భార్యాభర్తల అన్యోన్య జీవితాన్ని బాగానే సాగినా ఒక సంవత్సరం గడిచే లోపే వరకట్న వేధింపులు, గృహ హింస, భార్యపై అనుమానం ఇలా అనేక రకాల కారణాలతో వివాహితలు ఆత్మహత్యలు చేసుకోవటం లేక దారుణ హత్యలకు గురవటం చూస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉత్రా కేసు, విస్మయ ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
దీంతో ఆ రాష్ట్ర మహిళా కమిషన్ వివాహితులపై జరుగుతున్న ఇలాంటి దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివాహితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టడానికి పెళ్లికి ముందు వధూవరులకు ప్రి వెడ్డింగ్ కౌన్స్ లింగ్ ఇవ్వనున్నామని కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సతీదేవి తెలిపారు.

పెళ్లికి ముందే దాంపత్య జీవితంలో జరిగి చిన్న చిన్న పొరపాట్లను ఎలా ఎదుర్కోవాలి, భార్యాభర్తలు అనోన్య జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే అంశాలపై వధూవరులకు ఇకపై తప్పనిసరిగా కౌన్స్ లింగ్ ఇవ్వనున్నామని ఆమె తెలిపారు. ఇక దీంతో పాటు వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ కౌన్సెలింగ్కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
