సాధారణంగా రోడ్డు మీద బైక్‌పై, కారులోనో వెళ్తున్నప్పుడు.. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. పోలీసులు జరిమానా విధిస్తారు. అంతేకానీ సైకిల్ మీద వెళ్లే వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని.. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తికి లైసెన్స్ లేదని ఫైన్ వేస్తే.. ఏమనిపిస్తుంది.. ఆ పోలీసులకు బుర్రలేదనిపిస్తుంది. లేదా.. బాగా డబ్బులు అవసరం ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ట్రాఫిక్ పోలీసులు అతడికి ఫైన్ విధించారు. ఇదెక్కడి విడ్డూరం.. కారు నడిపే వ్యక్తికి హెల్మెట్ ఎందుకు అన్నా ఎవరు వినడం లేదు. ఈ పొరపాటు గురించి ఉన్నతాధికారులకు చెప్పడం కోసం వారి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ వివరాలు..
కేరళకు చెందిన ఎ. అజిత్ కుమార్ అనే వ్యక్తికి ఆల్టో కారు ఉంది. ఈ క్రమంలో 2021, డిసెంబర్ 7వ తేదీన అతడికి ఓ చలాన్ వచ్చింది. దానిలో.. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ లేకుండా మోటార్ బైక్ నడిపినందుకు ఈ జరిమానా విధించినట్లు ఉంది. వాహనం కేటగిరిలో కూడా మోటారు కారు అనే ఉంది. దాని రిజిస్ట్రేషన్ నంబర్ స్థానంలో అజిత్ దగ్గర ఉన్న మారుతీ ఆల్టో కారు నంబరుంది. దాంతో.. కారు నడిపే తనకు ఇలా మోటార్ బైక్ పేరుతో చలాన్ రావడం ఏంటని ఆశ్చర్యపోయాడు.
ఇది కూడా చదవండి: బర్త్ డే పార్టీ అంటూ ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడు.. అపై!
ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ట్రాఫిక్ పోలీసులు బైక్‌కే చలాన్ వేశారు.. దాని ఫోటో కూడా తీసుకున్నారు. కానీ రిజిస్ట్రేషన్ నంబర్ దగ్గర మాత్రం.. అజిత్ ఆల్టో కారు నంబర్ వేశారు. అంటే చివరి రెండు అంకెలు 77 వేయడానికి బదులుగా 11 వేశారు. దాంతో బైక్‌కు వెళ్లాల్సిన హెల్మెట్ ధరించని చలాన్ కాస్త.. కారు నడిపే అజిత్‌కు వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే ఈ సమస్య తలెత్తింది.
ఇది కూడా చదవండి: తమ్ముడు నన్ను చంపేస్తారు ఏమో..! కన్నీరు పెట్టించే ఓ నర్సు కథ!
ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు అజిత్‌కు సమస్యగా మారింది. తన కారు నంబర్ మీదే చలాన్ రావడంతో.. దాన్ని సెటిల్ చేసుకోవడం కోసం అజిత్ అధికారుల చుట్టూ పదేపదే తిరుగుతున్నాడు. సమస్యను పరిష్కరించకపోతే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చిరించాడు. ఈ సమస్యపై కేరళ ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ.. నెంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తింది తప్ప.. కావాలని చేసింది కాదు అంటున్నారు. కానీ నెటిజనులు మాత్రం.. ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మీకు కారుకి, బైక్‌కి తేడా తెలియదా.. మేం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే.. వెంటనే ఫైన్ వేస్తారు. మరి ఇప్పుడు మీకు ఏంత జరిమానా విధించాలి అని విమర్శిస్తున్నారు. ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెట్రోల్ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి KTR!