ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్. కొన్నాళ్ళుగా అక్కడి పూజారులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఆలయం ముందే ఆందోళన చేస్తున్న అక్కడి సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ హక్కులను హరించేదిగా ఉన్న దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని వారు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆలయం ముందు పూజారులు కూర్చుని మౌన నిరసన చేస్తున్నారు. బోర్డును ప్రభుత్వం రద్దు చేయనట్లయితే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని కేదార్ నాథ్ తీర్థ్ పురోహిత్ సమాజ్ హెచ్చరించింది.
ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు. దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో పాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామికి కూడా రక్తంతో లేఖలు రాశారు. కేదార్ నాథ్ దేవాలయంలోని ధమ్ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు, తీర్థపురోహిత్ సాకేత్ బగ్వాడీ, కేదార్ సభ అధ్యక్షుడు వినోద్ శుక్లా సమక్షంలో ఆందోళన చేపట్టి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర సీఎంకు రక్తంతో లేఖలు రాసి తమ నిరసన తెలిపారు.
గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు పురోహితులు. ఇలాగే రక్తంతో లేఖలు రాశారు. దేవస్థానం బోర్డును రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. మంగళవారం నుంచి ఉపవాసంతోనే నినాదాలు చేస్తున్నారు. ఈ లేఖలో పురాణ కాలం నుండి కేదార్‌నాథ్‌లో యాత్రికుల అర్చకుల హక్కులకు సంబంధించిన అనేక హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. సంప్రదాయాన్ని తారుమారు చేస్తున్నారు.