పాము పేరు చెప్పగానే భయంతో వణికిపోయేవారు కోకొల్లలు. దాన్ని చూడాలన్నా సరే చాలా మంది భయపడిపోతారు. పాము అనే పేరు వినపడగానే.. ఆమడదూరం పరిగెడతారు. అయితే పాములను ఆడించేవారు మాత్రం వాటితోనే కలిసి జీవిస్తారు అనే సంగతి తెలిసిందే. కానీ మాములు మనుషులు ఇలా పాముతో కలిసి జీవించడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఏంటి పాముతో కలిసి జీవించడమా.. పిచ్చా ఏంటి. అసలు పాము కనిపించగానే చంపేస్తాం కదా.. మరి దానితో కలిసి జీవించడం ఏంటి అనుకుంటున్నారా. మీరు ఎలా అనుకున్నా.. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఓ మహిళ పాముతో కలిసి జీవిస్తోంది. అది కూడా నాగుపాముతో. అందుకు ఆ మహిళ చెప్పిన కారణం వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకు సదరు మహిళ ఎందుకు ఇలా చేస్తుందో తెలియాలాంటే ఇది చదవాల్సిందే.
ఈ విచిత్ర సంఘటన కర్ణాటక, కులహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. శారవ్వ అనే మహిళ ఇలా పాముతో కలిసి జీవిస్తోంది. ఎందుకు అంటే చనిపోయిన తన భర్త ఇలా పాము రూపంలో వచ్చాడంటూ.. దానికి సపర్యలు చేస్తోంది. శారవ్వ భర్త రెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవిస్తోంది. ఈక్రమంలో నాలుగు రోజుల క్రితం ఓ పాము ఆమె ఇంట్లోకి వచ్చింది. దాన్ని చూసి భయపడాల్సింది పోయి.. భర్తే ఇలా పాము రూపంలో వచ్చాడంటూ.. పామును ఇంట్లోనే ఉంచుకుని సేవలు చేస్తోంది శారవ్వ.
ఇది కూడా చదవండి: ఆమె చేయని తప్పుకి శిక్ష అనుభవించింది!
ఇక రెండ్రోజుల క్రితం ఓ మహిళ శారవ్వ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో పాముని చూసి భయంతో బిగుసుకుపోయింది.. ఏంటి ఇది అని శారవ్వను అడగ్గా.. కొన్ని రోజులుగా పాము తన ఇంట్లోనే ఉంటుందని.. చనిపోయిన తన భర్తే ఇలా పాము రూపంలో వచ్చాడని.. అందుకే ఎవరిని ఏమీ చేయడం లేదని తెలిపింది. అంతేకాక పామును చంపవద్దని వేడుకుంది. అయితే చుట్టుపక్కల వారు దీని గురించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు శారవ్వ ఇంటికి చేరుకుని పామును అక్కడి నుంచి తీసుకుని వెళ్లి అడవిలో వదిలేశారు.
ఇది కూడా చదవండి: Chikmagalur: ‘నా లవర్ కోసం 4.50 లక్షలు ఖర్చు చేశాను.. అవి వసూలు చేయండి’.. ప్రేమికుడి సూసైడ్ నోట్ వైరల్!
ఇక శారవ్వ ఆ పాము తన భర్త అని.. దాన్ని తీసుకెళ్లవద్దని వేడుకుంది. కానీ అధికారులు మాత్రం.. ఏదో ఓ రోజు ఆ పాము కాటేస్తుందని తెలిపి.. దాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లారు. ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Face Book: యువతిగా యువకుడిని ముగ్గులోకి దింపిన 50ఏళ్ల ఆంటీ! పెళ్లికి కూడా సిద్ధమయ్యాక షాకింగ్ ట్విస్ట్!