SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Indias Steel Man Jamshed Jirani Passed Away

బ్రేకింగ్: భారత ఉక్కు మనిషి.. టాటా స్టీల్ మాజీ ఎండీ మృతి..

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 1 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్రేకింగ్: భారత ఉక్కు మనిషి.. టాటా స్టీల్ మాజీ ఎండీ మృతి..

భారత ఉక్కు మనిషి, టాటా సన్స్ మాజీ డైరెక్టర్, టాటా స్టీల్ మాజీ ఎండీ జంషెడ్ జె ఇరానీ (86) ఇక లేరు. ఇండియన్ స్టీల్ మేన్ గా పేరొందిన జంషెడ్ జె ఇరానీ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జంషెడ్ పూర్ లో టాటా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. భారతదేశపు ఉక్కు మనిషి, పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూసిన విషయాన్ని టాటా స్టీల్ కంపెనీ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 2 1936లో జన్మించిన ఈయన భారతదేశ ఆర్థిక సరళీకరణ సమయంలో టాటా స్టీల్ కంపెనీ అభివృద్ధికి విపరీతంగా కృషి చేశారు. భారతదేశంలో ఉక్కు పరిశ్రమని వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి జె జె ఇరానీ. ఈయన 1979లో టాటా స్టీల్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా, 1985లో ప్రెసిడెంట్ గా, 1988లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా, 1992లో మేనేజింగ్ డైరెక్టర్ గా చేసి విశిష్ట సేవలందించారు.

జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ తీసుకున్నారు. 43 ఏళ్ల పాటు విశిష్టమైన సేవలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. తన ప్రతిభా చాతుర్యంతో టాటా స్టీల్ కంపెనీకి అంతర్జాతీయ ఖ్యాతిని, గుర్తింపుని తీసుకొచ్చారు. ఈయన చేసిన కృషికి భారత ఉక్కు మనిషి అన్న పేరు కూడా వచ్చింది. భారతదేశ ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ (అక్టోబర్ 31 1875 -డిసెంబర్ 15 1950) జయంతి రోజున జె జె ఇరానీ మరణించడం ఆశ్చర్యపరుస్తుంది. సర్దార్ పటేల్ తర్వాత ఉక్కు మనిషి అన్న బిరుదును జంషెడ్ జె ఇరానీ సొంతం చేసుకున్నారు. ఉక్కు మనిషిగా పేరొందిన జంషెడ్ జె ఇరానీ మృతిపై టాటా స్టీల్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.

We are deeply saddened at the demise of Padma Bhushan Dr. Jamshed J Irani, fondly known as the Steel Man of India. Tata Steel family offers its deepest condolences to his family and loved ones. pic.twitter.com/gGIg9JgGMS

Join Our Whatsapp Channel

— Tata Steel (@TataSteelLtd) October 31, 2022

Tags :

  • Breaking News
  • Jamshed Jiji Irani
  • national news
  • Tata group
  • Tata Steel
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 24 మంది కార్మికులు మృతి..

    ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • హైదరాబాద్ లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం.. 10 ఏళ్ల బాలుడు మృతి..

    పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

  • యువకుడి శరీరంలో 4 అడుగుల షవర్ పైపు.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు

    యువకుడి కడుపులోకి 4 అడుగుల పైప్..!

  • ఆసుపత్రిలో షాకింగ్ ఘటన.. వైద్యులపై దాడి చేసిన రోగి

    ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • బంగారం ధరలు తగ్గడంతో బ్యాంకుల నుంచి నోటీసులు..

  • విద్యార్థినికి అసభ్య మెసేజ్‌లు.. లెక్చరర్‌కు దేహశుద్ధి!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam