క్రైమ్ చావదు దాని రూపం మార్చుకుంటుంది అంతే.. అన్న ఆర్జీవీ మాటలు నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ కు అక్షరాల సరితూగుతాయి.
నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ చూసి ఒక్కోసారి పోలీసులే కంగుతింటున్నారు. ఆ రీతిలో దేశంలో క్రైమ్ సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి తాజాగా వెలుగుచూసింది. సముద్రంలో అక్రమంగా తరలిస్తున్న 17.74 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కోస్ట్ గార్డు పోలీసులు. దీని విలువ అక్షరాల రూ. 10.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో కేజీల కొద్ది బంగారాన్ని సీజ్ చేశారు కోస్ట్ గార్డు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అక్రమంగా ఏదైనా దేశంలోకి తరలించాలి అంటే స్మగ్లర్లు ప్రధానంగా ఎంచుకునే మార్గం సముద్రమార్గం. ఈ మార్గం గుండానే దేశంలోకి స్మగ్లర్లు వస్తువులు తెస్తుంటారు. అలా సముద్రమార్గం గుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సంబంధించిన అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అది చెన్నైలోని మండపం సముద్రతీరం. అక్కడికి శ్రీలంక నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారు అన్న సమాచారన్ని అందుకున్నారు కోస్ట్ గార్డ్ పోలీసులు. వెంటనే రంగంలోకి దిగారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI),చెన్నై, ఇండియన్ కోస్ట్ గార్డ్ మండపం డిపార్ట్ మెంట్ వారు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్ లో సముద్రజలాల్లో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ ఫిషింగ్ బోర్డును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోటులో ముగ్గురు వ్యక్తులతో పాటు అక్రమంగా తరలిస్తున్న 17.74 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 10.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే గత రెండు రోజులుగా ఈ ఏరియాలో నిఘా ఉంచారు కోస్టల్ పోలీసులు. సముద్ర జలాల్లోకి ఆ బోటు వచ్చిందని సమాచారం అందగానే ఆ బోటును చుట్టుముట్టారు అధికారులు. అయితే ఈ రూట్ లో గతంలో కూడా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, స్మగ్లింగ్ వస్తువులను స్వాధీనం చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.
Tamil Nadu | In a joint op, Indian Coast Guard along with DRI Chennai, seized a gold consignment of 17.74 kg (net value approx Rs 10.5 cr) from Mandapam seashore being smuggled from Sri Lanka. The fishing boat along with 3 crew handed over to Coastal Security Group, Mandapam. pic.twitter.com/il6lnDLwp6
— ANI (@ANI) February 9, 2023