తన స్నేహితుడికి జరిగిన సంఘటన మరో కుటుంబంలో జరగకూడదు అని ఓ ఉద్యమాన్నే ప్రారంభించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర. ఇప్పటి వరకు 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఫ్రెండ్ కు జరిగిన సంఘటన మరోకరికి జరగకూడదు అని పోరాాడుతున్నాడు.
ఓ వ్యక్తికి ఓ సంఘటన ఇన్సిపిరేషన్ కావొచ్చు. మరో వ్యక్తికి తన జీవితంలో జరిగిన సొంత అనుభవమే గుణపాఠం నేర్పొచ్చు. అయితే ఆ సంఘటనల నుంచి ఏం నేర్చుకున్నాం. వాటిని ఎంత వరకు ఆచరిస్తున్నాం, నలుగురికి దాని గురించి ఎంత వరకు వివరిస్తున్నాం అన్నదే ఇక్కడ అసలు పాయింట్. ఇక చాలా వరకు మన కళ్ల ముందు జరిగిన ప్రమాద దృశ్యాలను చూసి అయ్యో పాపం అనుకుంటారు. ఇంటికి వెళ్లాక ఆ సంఘటన గురించి మర్చిపోతారు. అయితే ఈ వ్యక్తి మాత్రం తన స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటన, మరే ఇతర కుటుంబాల్లో జరగకూడదు అని ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి స్నేహితుడి కథ ఏంటి? ఫ్రెండ్ కోసం ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టి ప్రారంభించిన ఆ ఉద్యమం ఏంటి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తన స్నేహితుడికి జరిగిన సంఘటన మరో కుటుంబంలో జరగకూడదు అని ఓ ఉద్యమాన్నే ప్రారంభించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర.. అలియాస్ ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’. ఓ రోడ్డు ప్రమాదంలో తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సంఘటన రాఘవేంద్రను ఎంతగానో కలచివేసింది. తన స్నేహిడుతు ప్రాణాలు కోల్పోవడానికి కారణం హెల్మెట్ లేకపోవడమే అని తెలుసుకున్న అతడు.. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రానియ్యకూడదు అని నిర్ణయించుకున్నాడు రాఘవేంద్ర. అందులో భాగంగానే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు ఖర్చు పెట్టి, ఉచితంగా 56 వేల హెల్మెట్లను దానం చేశాడు. దాంతో అతడిని హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ కు జరిగిన దుస్థితి మరే ఇతర కుటుంబాలకు రాకూడదు అని ఓ ఉద్యమంలా హెల్మెట్ లేని వారికి పిలిచి మరి ఉచితంగా హెల్మెట్స్ పంపిణీ చేస్తున్నాడు రాఘవేంద్ర. ఈ సందర్భంగా తన గతాన్ని ఓ సారి గుర్తుచేసుకున్నారు. 2009 లో నోయిడాలో లా కోర్స్ చేయడానికి బీహార్ నుంచి వచ్చాడు రాఘవేంద్ర కుమార్. ఇక అదే బిహార్ నుంచి ఇంజినీరింగ్ చేయడానికి వచ్చాడు కృష్ణ కుమార్. అనుకోకుండా ఇద్దరు రూమ్మేట్స్ అయ్యారు. అక్కడి నుంచి వారిద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే 2014లో నూతనంగా వేసిన యమునా ఎక్స్ ప్రెస్ వే మీద కృష్ణ కుమార్ బండిపై హెల్మెట్ లేకుండా వెళుతూ.. యాక్సిడెంట్ కు గురైయ్యాడు. అయితే అతడికి శరీరంపై ఒక్క గాయం కూడా కాలేదు. ఒకే ఒక్క గాయం తలకు తగిలింది. ఆ గాయం కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు అని డాక్టర్లు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు లోకం విడిచిపోవడంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. దాంతో హెల్మెట్ ఉంటే నా ఫ్రెండ్ బతికేవాడు అన్న బాధ నన్ను ఇప్పటికీ విడిచిపెట్టడం లేదు. అందుకే నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను అని రాఘవేంద్ర చెప్పుకొచ్చాడు.
ఇక 2014 నుంచి అతడు హెల్మెట్స్ పంచుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఇక అతడు పంచిన హెల్మెట్స్ వల్ల ప్రాణాలు కాపాడుకున్న వారు తనకు ఫోన్ చెప్తుంటారని, వారి మాటలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని రాఘవేంద్ర తెలిపాడు. అయితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా గానీ ఇప్పటికీ చాలా మంది హెల్మెట్ లేకుండానే వాహనాలు నడుపుతుండటం బాధాకరం. ఇక 4 సంవత్సరాలు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని రాఘవేంద్ర సుప్రీం కోర్టులో పిల్ వేశాడు. ఈ విషయంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశానని చెప్పుకొచ్చాడు రాఘవేంద్ర. ఇతడు చేస్తున్న పనిని ప్రశంసిస్తూ.. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తన ట్వీటర్ లో అతడి గొప్పతనం గురించి చెబుతూ.. పోస్ట్ షేర్ చేశాడు. మరి తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయిన విధంగా ఇంకెవరూ కోల్పోవద్దని ఇంత పెద్ద ఉద్యమం చేస్తూ.. హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన రాఘవేంద్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హెల్మెట్ లేక ప్రాణం కోల్పోయిన ప్రాణ స్నేహితుడి దుస్థితి వేరేవ్వరికి రాకూడదని..
చేస్తున్న ఉద్యోగం వదిలి, ఇప్పటివరకు 2 కోట్లు ఖర్చు పెట్టి, ఉచితంగా 56 వేల హెల్మెట్లు దానం చేసిన #HelmetManOfIndia రాఘవేంద్ర 👍👍 pic.twitter.com/ZaP7pHiuuJ— PVP (@PrasadVPotluri) March 18, 2023