గతంలో సినిమాలను నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించేవారు. ఆ సినిమాలను చూస్తుంటే.. ఆ ఇదెక్కడో చూశానో అనిపించేలా ఉండేది. ఇప్పుడు తెరకెక్కుతున్నాయ్ అనుకోండి... కాకుంటే రేప్ ఎలా చేశారు..? ఎంత మంది పాల్గొన్నారు..? ఇలాంటివి కథల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంచితే, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇద్దరు భార్యలతో ఎంత ఆనందంగా గడుపుతారో అని అందరూ అనుకుంటారు.. అది ముమ్మాటికీ తప్పు. ఇద్దరు సర్దుకు పోతే పర్లేదు కానీ లేదంటే ఈ కథనంలో మొగుడిలా వంతుల వారీగా కాపురం చేయాల్సి ఉంటుంది.
‘ఏవండి.. ఆవిడొచ్చింది’ ఈ సినిమా చూశారా..? ఇదే కాన్సెప్ట్. ఒక భర్త.. ఇద్దరు భార్యలు. ఇందులో శోభన్‌బాబు మొదటి మూడు రోజులు మొదటి భార్య(వాణిశ్రీ) దగ్గర, మరో మూడు రోజులు రెండో భార్య(శారద) దగ్గర ఉంటాడు. ఒక రోజు మాత్రం అతడికి స్వేచ్ఛ లభిస్తుంది. ఆ రోజు తన ఇంటికి వెళ్లి హాయిగా తల్లిదండ్రులతో కలిసి ఉంటాడు. మధ్య ప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం ఈ విచిత్రమైన తీర్పిచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు అయితే.. వారంలో మూడు రోజులు ఒక భార్య వద్ద, మరో మూడు రోజులు రెండో భార్య ఉండాలని తీర్పిచ్చింది. మిగిలిన ఆ ఒక్కరోజు ఆదివారం మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించింది.
ఈ కథనంలో భర్త హర్యానాలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్ కు చెందిన సీమ(28) అనే మహిళతో వివాహమయ్యింది. వీరిద్దరూ రెండేళ్ల పాటు కలిసి ఉన్నారు. అయితే, 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ భార్య.. భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ కాలంలో సదరు భర్త ఒంటరిగా ఉండలేక మరో మహిళకు ఆకర్షితుడయ్యాడు. తాను పనిచేస్తున్న ఆఫీస్ లోనే మరో మహిళతో సంబంధం నెరిపాడు. ఆ తర్వాత ఆమెను వివాహమాడాడు. వీరికి ఓ పాప జన్మించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మొదటి భార్య తొరిగొచ్చింది. ఇంకేముంది.. భర్త రెండో పెళ్లి గురుంచి తెలిసి, ఇద్దరి తాట తీసింది. ప్రతి రోజూ ఇదే గొడవ. నేనుండగా ఇంకో మహిళను ఎలా పెళ్లి చేసుకున్నావ్..? అంటూ మొదటి భార్య గొడవకు దిగేది. చివరకు ఆమె.. తన భర్త తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడని, కావున విడాకులు మంజూరు చేయడంతో పాటు భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది.
పూర్తి వివరాలు విన్న గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ హరీష్ దేవన్, ఇందులో భర్తను వదిలి వెళ్లిపోవడం మొదటి భార్య తప్పయితే, ఆమెను సంప్రదించకుండా రెండో పెళ్ళి చేసుకోవడం భర్త తప్పని నిర్ధారించాడు. ఆపై నెలల పాటు ఆ ఇద్దరు భార్యలు, భర్తతో చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదే వారంలోని ఏడు రోజుల్లో.. చెరో మూడు రోజుల చొప్పున భర్త.. ఇద్దరు భార్యల వద్ద ఉండేలా అంగీకరించాలని నచ్చజెప్పాడు. మిగిలిన ఒక్కరోజు(ఆదివారం) భర్తకు నచ్చిన చోట ఉండొచ్చని తెలిపాడు. దీనికి ఇద్దరు భార్యలు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ తీర్పు తర్వాత భర్త, ఆ భార్యలు చాలా సంతోషంగా ఉన్నారని, అతడు మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగి కనుక ఆర్థిక కష్టాలు లేకపోవడంతో ఇద్దరినీ మంచిగా చూసుకుంటున్నట్లు ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ తెలిపారు. ఏ 2విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
एक पति की दो पत्नियां, कोर्ट ने कहा, “पहले तीन दिन पहली पत्नी के साथ, बाकी के तीन दिन दूसरी पत्नी के साथ रहो”
◆ रविवार को पति अपनी मर्ज़ी से किसी के भी साथ रह सकता है #MadhyaPradesh pic.twitter.com/vY7jn8c1uq
— News24 (@news24tvchannel) March 14, 2023