కరోనా తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పథకం కింద ఉచిత ఆహారధాన్యాల పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే ఇప్పుడు రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనుంది. అయితే అన్ని రాష్ట్రాల వారికి కాదులెండి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఈ నెల 150 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని బీపీఎల్ ప్రజలకు ఈ నవంబర్ నెలలో కుటుంబానికి 45 నుంచి 135 కిలోల బియ్యం అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
అలాగే ఎంపిక చేసిన రేషన్ కార్డుదారులకు అయితే 15 నుంచి 150 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. అయితే ఎవరికి ఎన్ని కిలోలు అనేది మాత్రం వారి కుటుంబంలో ఎంతమంది ఉంటారు అనే దానిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు. ఛత్తీస్ గఢ్ లో అక్టోబర్ వరకు బియ్యాన్ని ఒక నిర్దిష్ట మొత్తానికి విక్రయించారు. బీపీఎల్ కుటుంబాలు కిలో రూ.1కి, ఏపీఎల్ ప్రజలు కిలో రూ.10కి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అప్పుడు కుటుంబానికి గరిష్టంగా 85 కిలోల బియ్యం పంపిణీ చేశారు. అయితే డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని ప్రధాని మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రకటించిన అక్టోబర్ నెలలో ఈ పంపిణీ జరగలేదు. కావున ఇప్పుడు అక్టోబర్- నవంబర్ రెండునెలలకు సంబంధించిన బియ్యం ఇప్పుడు రాష్ట్రాలకు అందింది. అంటే కుటుంబాలకు అదనంగా 5 నుండి 50 కిలోల వరకు బియ్యం పంపిణీ జరుగుతుంది. అంటే రాష్ట్రం ఇచ్చే బియ్యం మాత్రమే కాకుండా.. కేంద్రం అందించే బియ్యాన్ని కూడా పొందనున్నారు.