ఓ వైపు ఇంధన ధరలు, మరోవైపు నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారాయి. రోజు గడవాలంటే వందలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక కూరగాయలు, ఆకు కూరలు కొనే పరిస్థితి లేదు. మాంసం ధరలు కొండెక్కాయి. ఇక టమాటా అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త స్థితిమంతులు సైతం.. కేజీల లెక్కన భారీగా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మేం చెప్పబోయే కాయగూర రేటు వింటే.. కొనడం కాదు కదా.. కనీసం దాని వైపు కన్నెత్తి చూడాలన్నా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ కాయగూర ధర కిలో ఏకంగా లక్ష రూపాయలు అన్నమాట. ఏంటి అసలు ఇంత ఖరీదు ఉన్న కాయగూరలు ఉంటాయా అనేది తెలియాలంటే ఇది చదవండి.
కిలో ఏకంగా లక్ష పలికే ఈ కాయగూర పేరు “హాప్ షూట్స్”. ఈ కాయగూరల పువ్వులను హాప్ కోన్స్ అంటారు. వీటిని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మిగిలిని కొమ్మలను కూరగాయాలుగా వాడుకుంటారు.ఈ కాయగూర మొక్క కాండాన్ని కూడా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవలే ఇప్పుడిప్పుడే ఈ కాయగూరలను తినేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు ఈ కాయగూరని బిహార్‌లోని ఒక యువకుడు పండిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌ని భారత్‌లోని బిహార్‌కి చెందిన తొలి యువ రైతు అమ్రేష్ సింగ్ దీన్ని సాగు చేన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇది ఫేక్ వార్త అని తెలిసింది.