హెల్మెట్ ధరించారు, బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు మనకేం జరిమానా విధించరు అని అనుకుంటే పొరపాటే. మీ దగ్గర వీటితో పాటు ఇంకొకటి ఉండాలి. ఆ ఒక్కటీ తగ్గితే మీకు 2 వేలు జరిమానా పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఒక్కటి ఏంటో తెలుసుకునే ముందు, ఎందుకు జరిమానా విధిస్తారో అనేది మీరు తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కొంతమంది “మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, హెల్మెట్ పెట్టుకున్నాం కదా.. ట్రాఫిక్ పోలీసులకు భయపడేదేంది? ఎవడ్రా మనల్ని ఆపేది” అంటూ ట్రాఫిక్ పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తున్నారు. మా దగ్గర ఆర్సీ ఉంది, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, ఆపినావ్ ఏంది? అంటూ కొంతమంది కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు.
పోలీసులు వాహనదారులని ఆపి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అని తనిఖీ చేసే క్రమంలో కొంతమంది పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూశాం. మా మావ ఎమ్మెల్యే అని ఒకడు, మా బంధువు ఎంపీ అని మరొకడు ఇలా ట్రాఫిక్ పోలీసుల మీద రెచ్చిపోతున్నారు. మొన్నా మధ్య కారు ఆపినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడో వ్యక్తి, రెండు రోజుల క్రితం నా కారుకే చలానా వేస్తావా అంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిందో మహిళ. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకే కొత్త రూల్ అమలులోకి వచ్చింది. తనిఖీలో భాగంగా బండికి సంబంధించిన కాగితాలను అడిగినప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఈ రూల్ వచ్చింది.
మారిన రూల్స్ ప్రకారం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించినప్పటికీ.. ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తే రూ. 2 వేలు జరిమానా చెల్లించక తప్పదు. మోటార్ చట్టంలోని రూల్-179 ప్రకారం వాహనదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఇక మోటార్ చట్టంలోని 194 డి రూల్ ప్రకారం.. వాహనదారులు ధరించే హెల్మెట్ కి బీఐఎస్ స్టాండర్డ్ లేకపోతే రూ. వెయ్యి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే వెయ్యి జరిమానా ఎలాగూ విధిస్తారు. అది తెలిసిన విషయమే. ఇక మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి స్థిరమైన దుస్తులను ధరించాలి. ద్విచక్ర వాహనదారులు బండి మీద ప్రయాణం చేసేటప్పుడు పూర్తిగా మూసి ఉన్న షూలను ధరించడం తప్పనిసరి అని ఒక రూల్ ఉందని గతంలో తెలుసుకున్నాం కూడా.
New Traffic Rules:
Now Challan of 2000, even if all the vehicles have paper.Under Motor Vehicle Act, if you misbehave with traffic policeman, then according to rule 179 MVA , he has the right to deduct your challan of INR 2000.#DelhiPolice
— Logical Trades (@logical_trades) July 2, 2022
ట్రాఫిక్ పోలీసులు గట్టిగా పట్టు పట్టి షూ ఏది అని అడిగితే చెప్పులతో ఉన్న మనం ఎక్స్ ట్రాలు చేస్తే రూ. వెయ్యి ఫైనేస్తారు. అదంత ఫైన్ గా ఉండదు. కాబట్టి కాస్త రెస్పెక్ట్ ఇచ్చేస్తే బెటర్. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకున్నా కూడా ఒకటి తగ్గింది పుష్ప అని వారితో అనిపించుకోకూడదు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి పోలీసులకు భయపడక్కర్లేదు అని అనుకుంటున్నారు కానీ వారి వృత్తికి గౌరవం ఇవ్వాలి అని ఎవరూ అనుకోవట్లేదు. కొంతమంది ట్రాఫిక్ పోలీసులు చెడ్డ వారు కావచ్చు, అంతమాత్రాన అందరూ చెడ్డ వారు అనుకుంటే ఎలా? వారి వృత్తికి గౌరవం, మర్యాద ఇవ్వడం మన బాధ్యత. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తే.. ట్రాఫిక్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు చట్టం అనుమతి ఇస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
వాహన చలానా గురించి తెలుసుకోవడానికి https://echallan.parivahan.gov.in/ క్లిక్ చేయండి.