బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్ ఫుడ్ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. విత్తనాలను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టిన తర్వాత, మొలకలు రావడం ప్రారంభమవుతాయి. మరియు రెండు నుంచి ఏడు రోజులపాటు పెరగడానికి అనుమతించబడుతాయి. మొలకెత్తిన గింజలు సాధారణంగా 2 నుండి 5 సెం.మీ పొడవు వరకు పెరుగుతాయి. ఈ మొలకల్లో విటమిన్ సి, కె అధికంగా లభిస్తాయి. విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. పెసర పొట్టులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. గర్భిణులకూ, గర్భస్థ శిశువుకు ఇదెంతో మేలు చేస్తుంది. పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అతిగా మాత్రం తినకూడదు. గ్యాస్ సమస్య ఎదురుకావొచ్చు.
మొలకెత్తిన గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి. రోజు వారి తినే ఆహారంలో మెులకలను చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
(మరిన్ని వివరాలకు ఈ వీడియో క్లిక్ చేయండి)