ప్రముఖ ఫుడ్ డెలివరీ పార్టనర్ స్విగ్గీ న్యూ ఇయర్ వేళ ఫుల్ స్వింగ్ ప్రదర్శించింది. కొత్త సంవత్సరం మరోవైపు వీకెండ్ కావడంతో.. స్విగ్గీకి డెలివరీల వెల్లువ వచ్చింది. ఒకవైపు ఫుడ్ డెలివరీ మరోవైపు స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ద్వారా సరుకులు కూడా డెలివరీ చేస్తోంది. అయితే ఈ న్యూ ఇయర్ కి డెలివరీల్లో స్విగ్గీ రికార్డులు సృష్టించింది. ఆ విషయాన్ని స్వయంగా ఆ సంస్థే సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఈ న్యూఇయర్ కి అత్యధికంగా కండో*మ్స్ డెలివరీ చేసినట్లు తెలిపారు. అదికూడా 2.5 నిమిషాల్లో కండో*మ్స్ డెలివరీ చేసి రికార్డు సృష్టించామన్నారు.
స్విగ్గీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 31 రోజున బిర్యానీలు, చిప్స్, కండో*మ్స్, పిజ్జాలు అత్యధికంగా ఆర్డర్ చేశారట. స్విగ్గీకి వచ్చిన ఆర్డర్లలో 75.4 శాతం ఆర్డర్లు హైదరాబాద్ బిర్యానీకే వచ్చాయట. తర్వాత ఇన్ స్టామార్ట్ ద్వారా 2.5 నిమిషాల్లోనే కండో*మ్స్ డెలివరీ చేశామన్నారు. దేశవ్యాప్తంగా స్విగ్గీ శనివారం 61 వేల పిజ్జాలు డెలివరీ చేసిందట. శనివారం 7 గంటల సమయానికే.. స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారట. ఇలా కొత్త సంవత్సరం రోజుని డెలివరీ పార్టనర్స్ కూడా పండగా జరుపుకున్నారు.
ప్రముఖ రెస్టారెంట్లు, ఆహార సంస్థల డెలివరీల విషయానికి వస్తే.. శనివారం డామినోస్ 61,300 పిజ్జాలను డెలివరీ చేసిందట. హైదరాబాద్ బావర్చీ రెస్టారెంట్ నిమిషానికి రెండు బిర్యానీలు డెలివర్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31 కోసం బావర్చి రెస్టారెంట్ 15 వేల కిలోల బిర్యానీ సిద్ధం చేసినట్లు చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇలా న్యూ ఇయర్ వేళ ఆహార, డెలివరీ సంస్థలకు ఫుల డిమాండ పెరిగింది. దేశవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకున్న ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పనిలేకుండానే ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ యాప్స్ ద్వారా ఆర్డర్లు చేసుకున్నారు.
today’s fastest @SwiggyInstamart order was condoms, delivered in 2.5 mins. now that’s a quickie 🫡
— Swiggy (@Swiggy) December 31, 2022