చేసేదే పాడు పని.. అందులో కూడా నిజాయితీని వెతుకున్నారు మూర్ఖులు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులకు ఆంక్షలు విధిస్తూ.. తన మాట ప్రకారం నడవాలన్న గీతలు గీసి పెత్తనం చెలాయిస్తారు కొందరు. ఇలాగే ఉండాలి అంటూ కట్టుకున్న భర్త లేదా భార్య లెక్కన అజమాయిషీ చేస్తుంటారు.
చేసేదే పాడు పని.. అందులో కూడా నిజాయితీని వెతుకున్నారు మూర్ఖులు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులకు ఆంక్షలు విధిస్తూ.. తన మాట ప్రకారం నడవాలన్న గీతలు గీసి పెత్తనం చెలాయిస్తారు కొందరు. ఇలాగే ఉండాలి అంటూ కట్టుకున్న భర్త లేదా భార్య లెక్కన అజమాయిషీ చేస్తుంటారు. దీంతో ఈ అక్రమ సంబంధాలు కూడా హత్యలకు దారి తీస్తున్నాయి. జీవిత భాగస్వామిలో ఏదో లోపం చూపుతూ.. వారిని మోసం చేస్తూ.. పరాయి పంచన చేరుతున్న జీవితాలు కూడా తెల్లారిపోతున్నాయి. మరో వ్యక్తితో అక్రమ సంబంధం నెరిపిన మహిళ చివరికి శవమై తేలింది. అయితే ఆమె ఎలా చనిపోయిందో తెలియరాలేదు. చివరకు ప్రియుడు మద్యం మత్తులో గుట్టు విప్పేశాడు.
తానే ప్రియురాలిని హత్య చేశానంటూ తాగి.. ఫ్లోలో చెప్పేశాడు. దీంతో పోలీసులకు నేరస్థుడిని వెతికే పని తప్పింది. ఫిబ్రవరిలో జరిగిన హత్య కేసు ఇప్పుడు హంతకుడు ఎవ్వరన్నదీ తేలింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హరపనహళ్లి తాలూకా నిట్టూరుకు చెందిన వ్యక్తితో దావణగెరె తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన కవితకు వివాహమైంది. అయితే ఆమె సలీం మున్నాఖాన్ తో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఆమెకు ఫోన్ చేస్తున్న ప్రతిసారి బిజీ అని రావడంతో సలీంకు అనుమానం ఏర్పడింది. తనతో కాక మరొకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని భావించాడు. ఈ విషయంపై మాట్లాడాదామని పిలిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హరహరకు వెళ్లి వస్తానన్న కవిత ఇంటికి తిరిగి రాలేదు. పుట్టింట్లో అడిగితే ఇక్కడకు రాలేదని చెప్పారు.
అనుమానం వచ్చిన కుటుంబ సభ్యుల హలవాగలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఒక పొలంలో కవిత మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే ఇటీవల తాగిన మత్తులో సలీం.. తానే కవితను హత్య చేశానని వాగాడు. ఈ విషయం కవిత కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. సలీంను అదుపులోకి తీసుకుని విచారించగా.. అనుమానంతోనే ఆమెను చంపేసినట్లు చెప్పాడు. ఆ రోజు కవిత, తాను తన సొంతూరు తెలగికి వచ్చి, అక్కడ నుంచి ఇద్దరూ కలిసి బైకులో కుంచూరి చెరువు వద్దకు వెళ్లామన్నారు. ఫోన్ బిజీ రావడంతో కవితను ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానంతో చిర్రెత్తుకొచ్చి గొంతు పిసికి హత్య చేశానన్నాడు. అనంతరం పొలంలో మృతదేహాన్ని కాల్చివేశానని నేరాన్ని అంగీకరించాడు.