ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ విషాదానికి ఒక్కడే కారణమని నెటిజన్స్ అంటున్నారు. అతడి వల్లే ఈ ఘోరం జరిగిందని వాళ్లు ఫైర్ అవుతున్నారు.
ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భారత్‌లో ఇప్పటిదాకా జరిగిన అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో దీనిని ఒకటిగా చెబుతున్నారు. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కి చేరింది. బోగీల కింద ఇంకా ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియడం లేదు. వందలాది మంది గాయపడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. బాలేశ్వర్‌కు దగ్గర్లో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వారి ట్రీట్మెంట్కు రక్తం పెద్ద మొత్తంలో అవసరం అవుతుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్‌ను బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు.
కాగా, ఒడిశా రైలు ప్రమాదంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఈ యాక్సిడెంట్‌కు రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్ మాస్టర్‌పై విమర్శలకు దిగుతున్నారు. గూడ్స్ రైలు వచ్చి లూప్లైన్లో ఆగి ఉన్నప్పుడు.. వెనకాల నుంచి వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్ మాస్టర్ ఎందుకు ఆపలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అధికారుల వద్ద వాకీ-టాకీలు ఉంటాయని.. ప్రమాదాన్ని ముందే పసిగట్టి పరిష్కరించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. స్టేషన్ మాస్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎవరి పైనా రైల్వే శాఖ చర్యలు తీసుకోలేదు. ఈ ఘోరానికి బాధ్యులు ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. బాధ్యుల మీద అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.