కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంతో రైల్వే శాఖపై, ఆ డిపార్ట్మెంట్ అధికారులపై విమర్శలు పెరుగుతున్నాయి. జనరల్, స్లీపర్ కోచ్ల విషయంలో ఇండియన్ రైల్వేస్ వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద వార్త దేశ ప్రజల్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా పలు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా ఈ ఘటనలో ఇప్పటిదాకా 278 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. మూడు రైళ్లు పరస్పరం ఢీకొన్న ఈ ఘటనలో వందలాది మంది ప్యాసింజర్లు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బోగీల కింద ఇప్పటికీ అనేక మంది చిక్కుకున్నారని సమాచారం. సహాయక చర్యల కోసం ఎన్టీఆర్ఎఫ్, ఓడీఆర్ఎఫ్తో పాటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. దాదాపు 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఒడిశా రైలు ప్రమాదంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. రైల్వే శాఖను టార్గెట్గా చేసుకొని వారు విమర్శలకు దిగుతున్నారు. లాభాల కోసం రైల్వే శాఖ కొన్నేళ్లుగా జనరల్, స్లీపర్ క్లాసులను తగ్గిస్తూ వస్తోందని నెటిజన్స్ అంటున్నారు. ప్రీమియమ్ ట్రైన్లు, ఏసీ రైళ్లను పెంచుతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న రైళ్లలో ఏసీ బోగీలను పెంచుతూ.. జనరల్, స్లీపర్ క్లాసులను తగ్గిస్తూ వస్తోందని మండిపడుతున్నారు. దీంతో ఆయా బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందని.. వేలాది మంది ప్యాసింజర్లు నిలబడేందుకు కూడా చోటు లేక తోసుకుంటూ వెళ్తున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రమాదం జరగడానికి ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఇరుగ్గా, నిలబడేందుకు చోటు లేకుండా ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందో తెలిపే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. జనరల్, స్లీపర్ కోచ్ల విషయంలో రైల్వే శాఖ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is the video of Coromandel express inside Reserved sleeper coach on 5th may 2023.
Now imagine the situation last night too.
This is complete failure and mismanagement from railways ministry.#TrainAccident
— Dr Nimo Yadav (@niiravmodi) June 3, 2023