ఒడిశాలోని బాలాషోర్‌లో జరిగిన రైళ్ల దుర్ఘటనలో ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఇంతటి విపత్తు జరిగిన సంగతి విదితమే. అయితే ప్రమాదానికి కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒడిశాలోని బాలాషోర్‌లో జరిగిన రైళ్ల దుర్ఘటనలో ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఇంతటి విపత్తు జరిగిన సంగతి విదితమే. అయితే ప్రమాదానికి కారణాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఆకస్మికంగా లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లడం వైపు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ లూప్ లైన్‌లో ఉంచిన గూడ్సును ఢీకొని భోగీలు చిందర వందయ్యి.. మరో పట్టాలపై పడ్డాయి. ఆ సమయంలో యశ్వంత్‌పూర్-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ డౌన్ మెయిన్ లైన్(డౌన్ లైన్) లోకి వచ్చి.. ఈ భోగీలను ఢీకొట్టింది. దీంతో పెను విపత్తు చోటుచేసుకుంది.
కాగా, ఈ ప్రమాదానికి కారణాలపై కుట్ర కోణం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రమాదానికి జరిగిన ప్రాంతంలో మూడు లైన్లు ఉన్నాయి. అందులో ఒకటి అప్ లైన్, డౌన్ లైన్, లూప్ లైన్. లూప్ లైన్ లో గూడ్సు బండిని ఉంచారు. అంతలో హౌరా నుండి వస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ స్టేషన్ వైపుకు వస్తుండగా.. ప్రధాన లైన్‌లో వెళుతున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. లూప్ లైనులోకి దూసుకెళ్లింది. క్రాసింగ్ వద్ద పట్టాల వద్ద ఉన్నలింక్ ఒక్కసారిగా దిశ మారడంతో.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దిశ మారిపోయింది. రైలు పట్టాలు మారేందుకు స్టేషన్ లో ప్రత్యేకమైన ఆపరేటర్ ఉంటారు. పాయింటింగ్ ఆఫీసర్ మారుస్తుంటారు. ఈ క్రమంలో ఇంత పెద్ద తప్పిదం జరిగింది.
ఈ స్విచ్చింగ్ వద్దే ఏదో ట్యాంపరింగ్ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ను మార్చారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైళ్ల రాకపోకలకు సిగ్నలింగ్ వ్యవస్థ కీలకమైనది. సిగ్నల్ పాయింట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒక రైలును మెయిన్ లైన్ నుంచి లూప్‌లైన్‌లోకి పంపిన తర్వాత, ఆ సిగ్నల్ పాయింట్లను ఆటోమెటిక్‌గా లాక్‌చేసి, మరో రైలు రాకుండా చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కావాలనే ఇంతటి దుర్ఘటన జరగాలని, కావాలనే ట్యాంపరింగ్ చేశారని, సిగ్నలింగ్ పాయింట్ లో మార్పులు చేసిన వారిని గుర్తించామని, త్వరలోనే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. క్యాబిన్‌లో ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు వచ్చి ఇలా చేశారా అని అనుమానిస్తున్నారు. ఈ కుట్రకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. సీసీటివీ ఫుటేజ్‌లో ఏముంది అన్న కోణాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.