తమిళనాడు లోని కున్నూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య, మరో 12 మంది ఆర్మీ అధికారులు చనిపోయారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వాసి సాయితేజ్ కూడా ఉన్నారు.
సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామం. సాయితేజ్ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా అధికారిగా సాయితేజ్ విధులు నిర్విహిస్తున్నారు. 2013లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు సాయితేజ్. సాయితేజ్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ్ స్వగ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు.
Details of people on board with CDS #BipinRawat Ji in the helicopter that crashed today pic.twitter.com/DhZhsRnEfp
— Live Adalat (@AdalatLive) December 8, 2021