మద్యం మత్తులో ఓ యువకుడు పాముతో పరాచకాలు ఆడాడు. విషపునాగుతో వింత విన్యాసాలు చేశాడు. దీంతో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ ఘటనను తమ ఫోన్లలో చిత్రీకరించారు.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండట్లేదు. ఆల్కహాల్ సేవిస్తున్న వారి సంఖ్య అంతకంతకీ ఎక్కువవుతోంది. కానీ అస్సలు తగ్గడం లేదు. కొందరు కిక్ కోసం మద్యం తాగుతుంటే, మరికొందరు జీవితంలోని బాధలు మర్చిపోయేందుకు తాగుతున్నామంటారు. స్టయిల్ కోసం మందు తాగే వాళ్లు కూడా ఉన్నారండీ.. ఏదేమైనా మద్యం పుచ్చుకునే వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయమే అందుకు నిదర్శనం. అయితే మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలు జరగడాన్నీ చూస్తున్నాం. అలాగే తాగిన మైకంలో ఇంట్లో వాళ్లతో, ఇతరులతో గొడవలు పడిన సందర్భాల గురించి వింటూనే ఉన్నాం. అయితే మద్యం మత్తులో తాచుపాముతో విన్యాసాలు చేయడం గురించి మాత్రం వినుండరు. అవును, ఓ వ్యక్తి తాగిన మైకంలో పాముతో వింత విన్యాసాలు చేశాడు.
కొన్నిసార్లు పామును నోట్లో, భుజాల మీద పెట్టుకొని ఆడాడో వ్యక్తి. అది కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బిహార్‌లోని సివాన్‌లో చోటుచేసుకుంది. బిహార్‌లోని సివాన్‌కు చెందిన ఇంద్రజీత్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఒక పామును పట్టుకున్నాడు. దాంతో వింత విన్యాసాలు చేశాడు. అందరూ చూస్తుండగా ఆ పాము తలను నోట్లో పెట్టుకొని, దాన్ని భుజాల మీద చుట్టుకొని ఆడాడు. దీంతో అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంద్రజీత్ వింత చేష్టలను ప్రజలు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ క్రమంలో పాము అతడి పెదవి మీద కాటేయడంతో అక్కడికక్కడే ఒక్కసారిగా కుప్పకూలాడు. గ్రామస్థులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇంద్రజీత్ మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
खतरों का खिलाड़ी… और जान गई! बिहार के सीवान का वीडियो है. शख्स को खेल-खेल में सांप ने डस लिया. सांप को कुछ देर तक गले में लटका कर वह लोगों का मनोरंजन करता रहा… लेकिन यह जानलेवा साबित हो गया. वीडियो अब वायरल हो रहा है. व्यक्ति इंद्रजीत राम नशे में धुत था.Edited by @iajeetkumar pic.twitter.com/LYgQ6MFw81
— Prakash Kumar (@kumarprakash4u) February 9, 2023