లోన్ చెల్లించకపోయినా, ఈఎంఐ ఆలస్యమైనా, ఓవర్ డ్యూ అయినా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. అయితే సిబిల్ స్కోర్ తగ్గిందన్న కారణంగా వారికి లోన్లు మంజూరు చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
రుణం ఇచ్చే ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ని చెక్ చేస్తుంటాయి. దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు. సిబిల్ స్కోర్ ని బట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తాయి. సిబిల్ స్కోర్ ని బట్టే వడ్డీ రేట్లు కూడా ఉంటాయి. 750 నుంచి 900 మధ్యలో ఉంటే ఎక్స్ లెంట్ స్కోర్ గా పరిగణిస్తారు. 700 నుంచి 750 మధ్యలో ఉంటే చాలా మంచి స్కోర్ గా పరిగణిస్తారు. 650 నుంచి 700 మధ్యలో ఉంటే మంచి స్కోర్ గా భావిస్తారు. 600 నుంచి 650 మధ్యలో ఉంటే లోన్ ఇవ్వడానికి సందేహిస్తారు. ఇక 600 కంటే తక్కువ ఉంటే లోన్ అప్రూవ్ చేసే అవకాశాలు తక్కువ. 300 ఉంటే బ్యాడ్ స్కోర్ గా పరిగణిస్తారు. లోన్లు పొందాలన్నా, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా ఈ సిబిల్ స్కోర్ అనేది ప్రాముఖ్యత వహిస్తుంది.
లోన్ సరిగా కట్టకపోయినా, ఈఎంఐ ఆలస్యమైనా, చెక్ బౌన్సు అయినా, క్రెడిట్ కార్డు బిల్ కట్టకున్నా సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. సిబిల్ స్కోర్ తగ్గిన వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అయితే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా వారికి బ్యాంకులు లోన్లు ఇవ్వడం ఆపకూడదని కేరళ హైకోర్టు తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకం కలగకూడదని కోర్టు వెల్లడించింది. తక్కువ సిబిల్ స్కోర్ కారణంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ను తిరస్కరించడం సరికాదని హైకోర్టు వెల్లడించింది. విద్యా రుణాల కోసం దరఖాస్తులను పరిశీలించే క్రమంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జస్టిస్ పి.వి. కున్హి కృష్ణన్ బ్యాంకులను హెచ్చరించారు.
విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు అని, ఈ దేశాన్ని వారే నడిపించాలని, నవ సమాజ నిర్మాతలు వారే అని కోర్టు వెల్లడించింది. కేవలం సిబిల్ స్కోర్ తక్కువ ఉందన్న కారణంతో ఎడ్యుకేషన్ లోన్ దరఖాస్తును తిరస్కరించడం సరికాదని అన్నారు. తనకు బ్యాంకు లోన్ ఇవ్వకపోవడం పట్ల ఓ విద్యార్ధి కోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ ను జస్టిస్ కున్హి కృష్ణన్ విచారించారు. ఆ విద్యార్ధి రెండు ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నారు. ఒక లోన్ మీద రూ. 16,667 ఓవర్ డ్యూ ఉంది. అలానే మరో బ్యాంక్ రెండో లోన్ ని రైటాఫ్ చేసింది. ఈ కారణంగా విద్యార్థి సిబిల్ స్కోర్ తగ్గింది. దీంతో బ్యాంకు లోన్ ఇవ్వమని అన్నది. ఆ విద్యార్ధి ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.
గతంలో కూడా ఎడ్యుకేషన్ లోన్ అంశం మీద బ్రాంచ్ మేనేజర్ ప్రణవ్ ఎస్ఆర్వీ మీద కోర్టు సీరియస్ అయ్యింది. తల్లిదండ్రుల సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ ఆపద్దని కోర్టు తీర్పు ఇచ్చింది. మన తెలుగు వాళ్ళు కూడా బ్యాంకులు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ తిరస్కరిస్తే కోర్టును ఆశ్రయిస్తే పనయ్యే అవకాశం ఉండచ్చు. మరి కేరళ హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Students are nation builders; banks should not deny them education loans over low CIBIL score: Kerala High Court
Read more: https://t.co/Zbs58sEP7c pic.twitter.com/jUnoGXJh2h
— Bar & Bench (@barandbench) May 31, 2023