వినాయక విగ్రహం పాలు తాగిన సంఘటన గతంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అద్భుతం చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామి విగ్రహం కళ్లు తెరిచిన అద్భుత సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ సంఘటన తమిళనాడు కోయంబత్తూరులోని మణికంఠస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. శనివారం 40వ వార్షిక పూజలో పాల్గొనేందుకు 3వేల మందికిపైగా అయ్యప్ప భక్తులు గుడికి చేరుకున్నారు.
ఈ సమయంలో పూజారులు అయ్యప్ప విగ్రహానికి అభిషేకం చేస్తుండగా.. విగ్రహం కళ్లు తెరిచినట్లు ఆలయ పూజారులు, భక్తులు గుర్తించారు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగుసార్లు విగ్రహం కళ్లు మూస్తూ, తెరుస్తూ ఉందని భక్తులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో ఆ అయ్యప్ప విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి పోటెత్తారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.