ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవరూ లేరు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే బ్యాంక్ సిబ్బందిని కలవాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ హాలిడేస్ కూడా తెలియాల్సి ఉంటుంది.
మన నిత్య జీవితంలో బ్యాంకింగ్ కీలకంగా మారింది. ఆర్థికంగా లావాదేవీలు, సేవింగ్స్, పేమెంట్స్, డిపాజిట్స్ మొదలైన కార్యకలాపాలు బ్యాంకు ద్వారా జరుగుతాయి. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవరూ లేరు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలంటే బ్యాంక్ సిబ్బందిని కలవాల్సి ఉంటుంది. మన కార్డ్స్ మిస్ అయినా మన అకౌంట్ వివరాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే సిబ్బందితో కమ్యునికేషన్స్ ఉండాలి. అలాంటప్పుడు బ్యాంక్ హాలిడేస్ కూడా తెలిసి ఉండాలి. బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. ఆగస్టు నెల హాలిడేస్ లస్ట్ విడుదల అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
జులై, ఆగస్టు 2023 నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. శని, ఆదివారాలు, పండుగలు కలుపుకుంటే ఆగస్టులో దాదాపు సగం నెల బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని పండుగలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
2003 ఆగస్టు 6వ తేది ఆదివారం, పార్సీ నూతన సంవత్సర సందర్భంగా ముంబై, నాగూర్, బేలాపూర్ బ్యాంకుల సెలవు, ఆగస్టు 8 వ తేది రమ్ ఫాట్ గ్యాంగ్టక్ లోని టెండాంగ్ సెలవు, 12వ తేదీన రెండో శనివారం సెలవు, 13వ తేదీన ఆదివారం కారణంగా సెలవు, 15వ తేదీన ఇండిపెండెన్స్ డే కారణంగా సెలవు, 18వ తేదీన శ్రీమంత శంకర్దేవ్ తిథి సందర్భంగా గౌహతిలో బ్యాంకులకు హాలిడే, 20వ తేదీన ఆదివారం సెలవు, 26వ తేదీన నాల్గో శనివారం బ్యాంకులకు సెలవు, 27వ తేదీన ఆదివారం బ్యాంకులకు సెలవు, 28వ తేదీన మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే, 29వ తేదీన తిరువీణం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు, 30 వతేదీన రక్షా బంధన్ సందర్భంగా జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు హాలిడే, 31 వ తేదీన శ్రీ నారాయణ గురు జయంతి/ పాంగ్ అబ్బోల్ సందర్భంగా డెహ్రాడూన్, గాంగ్టక్, కాన్పూర్,కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో బ్యాంకులకు హాలిడే.