ఎప్పుడు, ఎలా, ఎవ్వరితో ప్రేమ పుడుతుందో చెప్పలేం. వీరినే ఎందుకు ప్రేమించారని ప్రశ్నిస్తే.. వారి దగ్గరే సరైన సమాధానం దొరకదు. ప్రేమలో మునిగి తేలితే ప్రేమికులకు ప్రపంచమే కనిపించదు. వారి గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఇదంతా ప్రేమలో పడ్డాక. కానీ అసలు సమస్య ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆ రోజు తమ ప్రేమను వ్యక్తం చేయాలని భావిస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ ప్రపోజల్స్ లో భిన్నమైన పద్ధతులు వచ్చాయి. గ్రీటింగ్ కార్డ్స్, గులాబీలు ఇవ్వడమే కాదూ చాక్లెట్స్, చీరలు, గోల్డ్ రింగ్స్ వంటి కాస్ల్టీ బహుమతుల రూపంలో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.
కానీ ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి రిస్క్ తో కూడిన ప్రపోజల్ చేశాడు. భిన్నంగా తన ప్రేయసికి ప్రపోజల్ చేయాలనుకున్నామో.. ఓ రోడ్డుపై బైక్‌పై స్టంట్ చేస్తూ తన ప్రేమను ఆమె ముందుంచాడు. బైక్ పై ఆమె ముందు కూర్చోగా.. గులాబీ అందించాడు. దీన్ని తీసుకున్న యువతి.. పాజిటివ్ గా స్పందించినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను బ్లాక్ హార్ట్ బాయ్ అనే వ్యక్తి ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ రూపంలో పంచుకున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ వీరిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించాడు. అతడు ప్రశ్నించడమో ఏమో కానీ ఈ వీడియో నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అది నిజమైనా స్టంటా.. లేదా వీడియో క్రియేట్ కోసం చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తుంటే ప్రేమ ప్రపోజల్ కూడా హద్దులు దాటుతున్నట్లు అనిపిస్తుందీ కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
इन पर भी कोई कार्रवाई होगी क्या…#Trending #TrendingNews pic.twitter.com/Gdq4fTLlsa
— Narendra Singh (@NarendraNeer007) January 24, 2023