బైక్ కొనాలనే ఆశ గత మూడున్నరేళ్ల నుంచి అతనిని వెంటాడుతూనే ఉంది. నచ్చిన బైక్ కొనాలని ఆశ మదిలో బలంగా మెదులుతున్న చేతిలో మాత్రం చిల్ల గవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాక తన ఆశను మాత్రం అస్సలు చంపుకోలేదు. ఇక చివరికి తను అనుకున్నట్లుగానే మెచ్చిన బైక్ ను కొన్నాడు ఆ యువకుడు. చేతిలో చిల్లి గవ్వలేదని మీరే అన్నారు.. చివరికి ఎలా బైక్ ఎలా కొన్నాడనే కదా మీ ప్రశ్న.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన బూబతి అనే యువకుడు బిసిఎ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. దాని కన్న ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా పనిచేశాడు బూబతి. అయితే అలా ఉద్యోగం చేస్తున్న క్రమంలో తన డ్రీమ్ బైక్ కొనాలనుకుని మూడేళ్ల నుంచే రూపాయి నాణేలను సేకరించి తన పిగ్గీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు.
ఇది కూడా చదవండి: ఆ వ్యక్తి చేసిన చిన్న తప్పు.. కుటుంబాన్ని ఇంకా వదలని నాగు పాము..
అలా రూ.2లక్షలపైగా పోగైన చిల్లర నాణేలతో బూబతి బైక్ షోరూంకు వెళ్లాడు. అనుకున్నట్లుగానే తన వద్ద ఉన్న చిల్లరతో బైక్ కావాలంటూ షోరూం మేనేజర్ కు వివరించాడు. ఇక సానుకూలంగా స్పందించిన మేనేజర్ అతని వద్ద ఉన్న చిల్లరను లెక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఆ చిల్లర నాణేలను లెక్కబెట్టేందుు దాదాపు 10 గంటల సమయం పట్టందట. ఆపసోపాలు పడి చివరికి రూ.2లక్షల మొత్తాన్ని లెక్కబెట్టారు . ఇక మొత్తానికి అనుకున్నట్లుగానే బూబతి తన డ్రీమ్ బైక్ అయిన కొత్త బజాజ్ డామినార్ బైక్ ను కొని తన కోరికను తీర్చుకున్నాడు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఈ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.