మంచి ఉద్యోగం, చేతుల నుండా సంపాదన, బ్యాంకు బ్యాలెన్స్ మస్తుగా ఉన్న కుర్రకారుకు పెళ్లిళ్లు అవ్వడం కష్టంగా మారిపోయింది. కట్నం కాదు కదా.. ఎదురు కట్నం ఇచ్చైనా వివాహం చేసుకుందామన్నా సరైన అమ్మాయి దొరకని పరిస్థితి. కానీ
ఈ అమ్మాయిలంతా మోసగాళ్లకే పడిపోతారంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంది. అదీ నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త చదివితే అనాలని అనిపించక మానదు. ఎందుకంటే మంచి ఉద్యోగం, చేతుల నుండా సంపాదన, బ్యాంకు బ్యాలెన్స్ మస్తుగా ఉన్న అబ్బాయిలకు పెళ్లిళ్లు అవ్వడం కష్టంగా మారిపోయింది. 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కానీ బ్రహ్మచారులు దేశంలో నానాటికి పెరిగిపోతున్నారు. కట్నం కాదు కదా.. ఎదురు కట్నం ఇచ్చైనా వివాహం చేసుకుందామన్నా సరైన అమ్మాయి దొరకని పరిస్థితి. కానీ మోసం చేసే వాళ్లకు, మాయ మాటలు చెప్పే వాళ్లకు ఎలా పడిపోతున్నారో కానీ.. ఓ వ్యక్తి సుమారు 50 మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు.
విడాకులు తీసుకున్న, భర్తను వదిలేసిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ఘరానా మోసానికి తెరలేపాడు ఓ వ్యక్తి. 50 మంది మహిళలను మోసం చేసి, పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిని హర్యానా.. గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా నుండి అరెస్టు చేసి ఇక్కడకు తీసుకువచ్చారు. అతడిని జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌కు చెందిన తాపేష్ కుమార్‌గా(55) గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాపేష్.. కోల్‌కతాకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే భార్య, బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం బెంగళూరుకు వచ్చి ఉద్యోగాలప్లేస్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించాడు. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది స్త్రీ, పురుషులను మోసం చేశాడు. అప్పుడు మరో మోసానికి తెరలేపాడు. మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ప్రారంభించాడు. మ్యారేజ్ యాప్ ద్వారా మొదట మహిళలను స్నేహం చేసేవాడు.
అనంతరం అతడి మాటల వలలో క్షణాల్లో పడేసేవాడు. అతడిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు సిద్ధమయ్యేవారు. పెళ్లి, శోభనం జరిగిన వెంటనే భార్యను మోసం చేసి, డబ్బులు, నగలు తీసుకుని ఉడాయించేవాడు. అలా గురుగ్రామ్‌కు చెందిన మహిళను కూడా మోసం చేశాడు. పెళ్లైన తర్వాత మూడు రాత్రులు అయిన వెంటనే మహిళ నగలతో పాటు 20 లక్షలు తీసుకుని పరారయ్యాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.. నిందితుడ్ని అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశించారు. తీగలాగితే దొంక కదిలినట్లయింది. తాపేష్ 20 ఏళ్లల్లో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఒడిశాతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళలను మోసం చేసి దోచుకున్నాడు. ఈ మహిళల్లో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, అనేక ఇతర విద్యావంతులైన మహిళలు ఉన్నారు.