కొంతమందికి ఆరాటం ఎక్కువ ఉంటుంది. హోటల్ రూమ్ కి తీసుకెళ్లిన గర్ల్ ఫ్రెండ్ ని తృప్తిపరచాలని, లేదంటే గిట్టుబాటు అవ్వదని ఫీలవుతుంటారు. ఈ క్రమంలో రాత్రంతా మగధీరుడిలా నిలబడాలని డాక్టర్ల సలహా కూడా తీసుకోకుండా వయాగ్రా మాత్రలు వాడుతుంటారు. అయితే వయాగ్రా మాత్రలు వేసుకుని శృంగారంలో పాల్గొంటే చావుని కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అంగస్తంభన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వయాగ్రా మాత్రలు వాడాలి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలని వయాగ్రా మాత్రలు వాడుతున్నారు. ఒక వ్యక్తి మద్యం సేవిస్తూ.. రెండు వయాగ్రా మాత్రలు తీసుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో శృంగారం చేస్తుండగా మృతి చెందిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసన్ స్టడీలో ఈ విషయం ప్రచురితమైంది. నాగ్ పూర్ కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి 50 మిల్లీగ్రాముల వయాగ్రా మాత్రలను తనతో పాటు ఒక హోటల్ కి తీసుకెళ్లాడని వైద్యులు రివీల్ చేశారు. ఆ హోటల్ కి తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు వెళ్లి ఆ రాత్రి శృంగారంలో పాల్గొన్నాడని తెలిపారు.
అయితే అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కానీ మద్యం సేవించి ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఆ మరుసటి రోజు అనారోగ్యానికి గురయ్యాడు. అతనికి వాంతులు అవ్వడంతో ఆమె కంగారు పడింది. హాస్పిటల్ కి వెళదామని ఆమె సూచించింది. అయితే అతను హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే పరిస్థితి మరీ చేయిజారిపోతుండడంతో ఆమె అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయిందని, కార్డియోవాస్క్యులర్ హెమరేజ్ కి గురైనట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి మెడికల్ హిస్టరీ గానీ సర్జరీ హిస్టరీ గానీ లేనటువంటి వ్యక్తి ఒక మహిళతో హోటల్ గదిలో ఉన్నాడు. కేవలం 2 వయాగ్రా మాత్రలు, మద్యం తీసుకుని శృంగారంలో పాల్గొనడం వల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు స్టడీ తెలిపింది.
పోస్టుమార్టం చేసినప్పుడు అతని మెదడులో 300 గ్రాముల రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. మద్యం, వయాగ్రాతో పాటు అధిక రక్తపోటు అతని మృతికి కారణమై ఉండవచ్చునని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మెడికల్ అడ్వైస్ లేకుండా వయాగ్రా తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని, దీనిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని స్టడీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవల యూపీకి చెందిన ఒక నూతన వరుడు మంచాన్ని ఇరగ్గొట్టేయాలని అతిగా వయాగ్రా తీసుకుని సమస్యల్లో చిక్కుకున్న ఘటన బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాబట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే వయాగ్రా వాడాలని చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.