ఆస్పత్రి అంటే చావు బతుకుల్లో ఉన్న మనిషికి పునర్జన్మనిచ్చే ప్రాంతం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఆస్పత్రి మాత్రం ఇదుకు పూర్తిగా విరుద్ధం. మరీ ముఖ్యంగా చిన్నారుల పాలిట మృత్యుదేవతగా మారింది ఓ ఆస్పత్రి. ఇక్కడ ఏడాది కాలంలో సుమారు 69 వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఆస్పత్రి పేరు చెబితేనే ఒణికిపోతున్నారు తల్లిదండ్రులు. ఇంతకు ఆ ఆస్పత్రి ఎక్కడ ఉంది.. అసలక్కడ ఏం జరుగుతుంది వంటి వివరాలు..
ఇది కూడా చదవండి: ఉరి తీస్తానంటూ ఉద్యోగులకు కలెక్టర్ హెచ్చరిక! వీడియో వైరల్..
చిన్నారుల పాలిట మృత్యు దేవతగా పేరు పొందింది మధ్యప్రదేశ్ భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్. ముఖ్యంగా ఆస్పత్రిలోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో గత ఐదేళ్లలో సగటున రోజుకు దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారు. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌లో ఈ ఏడాది (2020- 21) దాదాపు 5,00,996 నవజాత శిశువులను చేర్చుకోగా, వారిలో 68,301 మంది మరణించారు. 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. ఈ యూనిట్‌లో చేరిన చాలా మంది శిశువుల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి : బిచ్చగాడి బ్యాగ్ లో కట్టల కొద్దీ డబ్బులు! వీడియో వైరల్!ఇప్పుడు ఇంత సడెన్ గా ఈ ఆస్పత్రి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. డిసెంబర్ 21న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఈ డేటాను అందించారు. నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని ఆరోగ్య మంత్రి తెలియజేశారు. ఐతే ఈ శిశువుల ఆరోగ్య భద్రతకై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విపక్షాలు మధ్యప్రదేశ్‌లోని హమీడియా ఆస్పత్రి అత్యంత ప్రమాదకర హాస్పిటల్ అని.. ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.