శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. అలాగే ఓ వ్యక్తి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఓ బెంగాలీ ప్రయాణికుడు తన డైరీలో రాసుకున్న ప్రేమ కాగితాలు రైలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి.
శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో వందలాది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 250కి పైగానే ఉన్నట్లు తెలుస్తొంది. అయితే ఈ రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక్కోక్కరి హృదయ గాథలు బయటికి వస్తున్నాయి. అలా ఓ వ్యక్తి తన ప్రియురాలు కోసం రాసిన ప్రేమ కథే ఈ రోజు మనకు విషాద కథ గా మారింది..ఆ ప్రేమ కథలే ఏం రాసి ఉందో తెలుసుకుందామా..
అలాగే ఓ వ్యక్తి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఓ బెంగాలీ ప్రయాణికుడు తన డైరీలో రాసుకున్న ప్రేమ కాగితాలు రైలు పట్టాలపై చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. అలా ప్రేమ కాగితాల్లో చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులు కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి అని అతడు బెంగాలీ భాషలో రాసాడు. అలా మరో కాగితంలో అన్ని వేళలా అన్ని చోట్లా నీ ప్రేమ కావాలి.. ఎప్పటికి నువ్వు నా మదిలోనే ఉంటావు అని రాసుకున్నాడట..
ఇలాంటి కవితలు, పద్యాలే కాకుండా రంగురంగులతో చాలా అందంగా గీసిన చిత్రాలు కూడా కనిపించాయట.అలా ఆ డైరీ చూసి రైల్వే సిబ్బంది షాక్ అయ్యారట. ఇంతకి ఆ డైరీ ఎవరిది? ఆ వ్యక్తి బతికే ఉన్నాడా లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. రైలు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి ఈ లవ్ లెటర్స్ కనిపించాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలు, కవితలు చూసి నెటీజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఇలా ఉండగానే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్, పాయింట్ మెషిన్ లో మార్పుల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ఈ విషయం తాజాగా తెలిసిందే అని అంటున్నారు.